ప్రస్తుత తరుణంలో ఎక్కడ చూసినా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ఎక్కువైపోయాయి. ప్రజలు ఏం కావాలన్నా చాలా వరకు ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేయడం మొదలు పెడుతున్నారు. ఇష్టమైన ఫుడ్ కావాలంటే చాలా దూరంలో ఉన్న రెస్టారెంట్‌కు వెళ్లక్కర్లేదు. ఆన్‌లైన్ యాప్‌లో ఆర్డర్ పెడితే చాలు. గంట లోపే కావల్సిన ఫుడ్ నేరుగా ఇంటికే చేరుతుంది. అయితే ఇదంతా ఒక ఎత్తయితే మనకు ఫుడ్ అందించేందుకు డెలివరీ బాయ్స్ పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వారు సకాలంలో ఫుడ్‌ను డెలివరీ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు తప్పవు. కొద్దిగా ఆలస్యమైనా వారి జీతంలో కోత పడుతుంది. దీంతోపాటు వారు రోజూ అధిక మొత్తంలో ఆర్డర్లను తక్కువ సమయంలో డెలివరీ చేయాల్సి ఉంటుంది.
ఇలా డెలివరీ బాయ్స్ మనకు ఫుడ్‌ను డెలివరీ చేసేందుకు నానా కష్టాలు పడుతుంటారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఓ డెలివరీ బాయ్‌కి మాత్రం కొండంత కష్టం వచ్చింది. దీంతో అతను వీధుల్లో తిరుగుతూ అందరినీ డబ్బులు అడగడం మొదలుపెట్టాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఢిల్లీలోని జీటీబీ నగర్‌లో ఓ జొమాటో డెలివరీ బాయ్ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అందరినీ డబ్బులు అడుగుతున్నాడు. కొద్ది రోజుల్లో తన సోదరి వివాహం ఉందని, అందుకు గాను తాను ఖర్చు పెట్టకుండా పైసా పైసా కూడబెట్టానని, కానీ ఇప్పుడు జొమాటోలో తన అకౌంట్ బ్లాక్ అయిందని, తన సోదరి వివాహం ఏం పెట్టి చేయాలని అతను భోరున విలపిస్తూ అందరినీ సహాయం చేయాలని అడగసాగాడు.
అయితే అతని దీనగాథను ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ట్వీట్ కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ జొమాటోకు వ్యతిరేకంగా ట్వీట్లు చేయసాగారు. ఇందుకు స్పందించిన జొమాటో వెంటనే యాక్షన్ తీసుకుంటామని, ఆ వ్యక్తికి న్యాయం చేస్తామని, తమకు కస్టమర్లు ఎలాగో డెలివరీ బాయ్స్ కూడా అలాగేనని, వారిని ఆదుకుంటామని ఆ సంస్థ స్పష్టం చేసింది. అయితే తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏది ఏమైనా డెలివరీ బాయ్స్ జీవితాలు ఎలా ఉంటాయో మరోసారి ఈ సంఘటన ద్వారా నిరూపితం అయింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…