కొంత మంది వ్యక్తులకి మనం ఎంత దగ్గరగా ఉంటే, అంత బాగుంటుంది. కానీ కొంతమందికి మాత్రం కాస్త దూరంగానే ఉండాలని ఆచార్య చాణక్య అన్నారు. చాణక్య మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకి చక్కటి పరిష్కారాన్ని ఇచ్చారు. చాణక్య చెప్పినట్లు చేస్తే కచ్చితంగా సమస్య నుండి బయటపడొచ్చు. చాణక్య ఆయన జీవితంలో ఎదురైన అనుభవాలని, ఆయన తెలుసుకున్న సత్యాలని పుస్తక రూపంలో మనకి అందజేశారు.
ఆ పుస్తకం చదివితే కచ్చితంగా మన జీవితంలో సమస్యలు అన్నిటికీ కూడా మనకి పరిష్కారం కనబడుతుంది. చాణక్యనీతిలో ఆచార్య చాణక్య ఈ వ్యక్తులకు దూరంగా ఉండాలని చెప్పారు. ఎటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలనే విషయానికి వస్తే.. స్వార్థపరులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని, ఇటువంటి వాళ్ళు ప్రమాదకరమని చాణక్య రాసారు. కోపంలో ఉండే వ్యక్తులతో కూడా దూరంగా ఉండడం మంచిదని చాణక్య వివరించారు.
పొగిడే వాళ్ళకి కూడా దూరంగా ఉండాలి. స్వార్థంతో ఉండేవాళ్ళు ఎప్పుడు వారి గురించి ఆలోచించి, పక్క వాళ్ళని ముంచేస్తారు. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండటం చాలా అవసరం. ఇతరుల గురించి పట్టించుకోడు స్వార్ధపరుడు. కేవలం తన గురించి మాత్రమే ఆలోచించుకుంటాడు. అలానే కోపంలో ఉండే వ్యక్తి ని కూడా దూరంగా పెట్టాలి. అదే విధంగా పొగిడే వ్యక్తి మీ ముందు పొగిడి, మిమ్మల్ని వెనుక తిడుతూ ఉంటాడు. అటువంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండటమే మంచిది.
మీ ముఖం మీద పొగిడే వ్యక్తి కచ్చితంగా మీ వెనుక చెడు చేస్తాడు అని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ మూడు రకాల వ్యక్తులకి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలాంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉండకపోతే, అనవసరంగా మీరే చిక్కుల్లో పడతారు. ఇలాంటి వాళ్ళని కనుక మీరు శ్రేయోభిలాషులుగా భావించారంటే కచ్చితంగా మీ జీవితం పాడవుతుందని గుర్తు పెట్టుకోండి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…