సాధారణంగా కొందరు పుట్టిన రోజులను జరుపుకోరు. కానీ బర్త్ డే వేడుకలను జరుపుకుంటే మాత్రం కచ్చితంగా కేక్‌ను కట్ చేస్తారు. ఇక పిల్లల కోసం తల్లిదండ్రులు బర్త్ డే వేడుకలను నిర్వహిస్తుంటారు. ఆ వేడుకల్లోనూ కేక్‌లను కట్ చేస్తుంటారు. అయితే పుట్టిన రోజు నాడు కేక్ లను ఎందుకు చేస్తారో తెలుసా ? అసలు ఆ సంప్రదాయం ఎప్పటి నుంచి ప్రారంభమైంది ? ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వ కాలంలో రోమన్లు కేవలం పెళ్లిళ్ల సందర్భంగా కేక్‌లను కట్ చేసేవారు పెళ్లి సమయంలో వధూవరులు ఒకరి చేతులను ఒకరు పట్టుకుని కేక్‌ను కట్ చేసేవారు. ఈ సందర్భంగా ఒకరికొకరు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసేవారు. అందుకు సూచనగా కేక్‌లను కట్ చేసేవారు. అయితే అప్పట్లో కేకులు వేరే విధంగా ఉండేవి. వాటిని పిండి, తేనె నట్స్ తో ఒకే పొరగా తయారు చేసేవారు.
ఇక 15వ శతాబ్దంలో ఆ సంప్రదాయం జర్మనీకి వ్యాప్తి చెందింది. వారు తమ పిల్లల పుట్టిన రోజు వేడుకల్లో కేక్‌ను కట్ చేసేవారు. అవి కూడా ఇంచు మించు రోమన్ల కేక్‌ల మాదిరిగానే ఉండేవి. కేక్‌ను కట్ చేయడం వల్ల తమ పిల్లలకు మంచి జరుగుతుందని వారు విశ్వసించే వారు.
అయితే 17, 18వ శతాబ్దాల్లో పారిశ్రామిక రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు, ప్రపంచీకరణ వల్ల కేకులను కట్ చేయడం అనేది దాదాపుగా అన్ని దేశాలకు విస్తరించింది. కానీ మొదట్లో కేవలం ధనికులు మాత్రమే తమ దర్జా కోసం కేక్‌లను కట్ చేసేవారు. అయితే నెమ్మదిగా ఆ సంప్రదాయం మరింతగా విస్తరించింది. దీంతో ఇప్పుడు అందరూ కేక్ లను కట్ చేస్తున్నారు. కేవలం బర్త్ డేలకే కాకుండా ఇతర శుభ కార్యక్రమాలకు కూడా ప్రస్తుతం కేక్‌లను కట్ చేస్తున్నారు. కానీ మొదట్లో అయితే పెళ్లిళ్లలోనే కేక్‌లను కట్ చేసేవారు. ఇవీ.. కేక్‌లను కట్ చేయడం వెనుక ఉన్న కారణాలు..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…