కోడిగుడ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. కోడిగుడ్లను సంపూర్ణ పోషకాహారంగా భావిస్తారు. వాటిల్లో మన శరీరానికి ఉపయోగపడే అన్ని పోషకాలు ఉంటాయి. అయితే గుడ్లను ఉడకబెడితే సాఫ్ట్ బాయిల్డ్, మీడియం, హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ అని పిలుస్తారు. కొందరు ఆ విధంగా గుడ్లను ఉడకబెట్టి తింటారు. అయితే వీటి మధ్య తేడాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కోడిగుడ్డును బాగా ఉడకబెట్టేందుకు సుమారుగా 12 నిమిషాల సమయం పడుతుంది. అలా ఉడికిస్తే దాన్ని హార్డ్ బాయిల్డ్ ఎగ్ అంటారు. గుడ్డులోని తెల్లని, పచ్చని సొనలు రెండూ బాగా ఉడుకుతాయి. చాలా మంది గుడ్లను ఇలాగే ఉడికించి తింటారు.
అయితే కోడిగుడ్లను 12 నిమిషాల పాటు కాక 5 నిమిషాల పాటు ఉడికిస్తే తెల్లని సొన ఉడుకుతుంది. కానీ లోపలి పచ్చ సొన క్రీమ్ మాదిరిగా మారుతుంది. దీన్నే సాఫ్ట్ బాయిల్డ్ గుడ్డు అంటారు. దీన్ని పాస్తాలు, టోస్ట్‌ల వంటి వాటిపై వేసుకుని తినవచ్చు.
ఇక గుడ్లను 8 నిమిషాల పాటు ఉడికిస్తే వాటిని మీడియం బాయిల్డ్ ఎగ్స్ అంటారు. తెల్లని, పచ్చని సొనలు రెండూ ఉడుకుతాయి. కాకపోతే పచ్చ సొన మరీ బాగా ఉడకదు. కొంచెం మెత్తగా ఉంటుంది. దీన్ని సలాడ్స్‌లో వేసుకుని తింటారు.
అయితే ఎవరైనా సరే తమ సౌకర్యాన్ని బట్టి తమకు ఇష్టం వచ్చిన విధంగా గుడ్లను ఉడికించి తినవచ్చు. ఎలా తిన్నా వాటితో పోషకాలు అందుతాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…