Blood Groups : ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి రక్తం ఏదో ఒక బ్లడ్ గ్రూప్‌కు చెందినది అయి ఉంటుందని అందరికీ తెలిసిందే. బ్లడ్ గ్రూప్స్ ప్రకారమే ఏ వ్యక్తికి అయినా అవసరం ఉన్న రక్తాన్ని ఎక్కిస్తారు. అలాగే అవయవాలను కూడా ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. ఇక ఈ విషయం పక్కన పెడితే సినిమాల్లో రక్తం గురించి డైలాగ్‌లు చెబుతారు కదా.. అదేనండీ.. మా వంశం, మా రక్తం చరిత్ర.. అని డైలాగ్ లు ఉంటాయి కదా. అవే.. అయితే ఆ డైలాగ్ లను ఏ ఉద్దేశంతో రాశారో తెలియదు కానీ.. నిజంగా రక్తానికి మాత్రం వ్యక్తిగత చరిత్ర ఉంటుంది. అంటే.. ఒక్కో రకమైన బ్లడ్ గ్రూప్ కలిగిన వారికి ఒక్కో రకమైన మనస్తత్వం, వ్యక్తిత్తం ఉంటాయి. మరి ఏ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు ఎలాంటి వారో ఇప్పుడు తెలుసుకుందామా.
ఎ పాజిటివ్ (A+) – వీరు మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేసే వారు అయి ఉంటారు. తమ చుట్టూ ఉన్న వారిని ముందుండి నడిపిస్తారు. వారికి ప్రోత్సాహం అందిస్తారు. చిన్న విషయం పట్ల కూడా తీవ్రంగా స్పందిస్తారు.
ఎ నెగెటివ్ (A-) – వీరు కష్టపడే తత్వం కలిగిన వారు అయి ఉంటారు. ఎంత సమస్య ఉన్నా దాన్ని పరిష్కరించేదాకా వదలరు. అలాగే తాము అనుకున్నది సాధించడం కోసం ఎంతటి కష్టమైనా చేస్తారు. దాని ఫలితం అనుభవిస్తారు. ఏదైనా సాధించాలనుకుంటే చివరి దాకా విడిచి పెట్టరు.
బి పాజిటివ్ (B+) – వీరు త్యాగశీలురు అయి ఉంటారు. తమ కోసమే కాక ఇతరుల కోసం కూడా త్యాగం చేస్తారు. అవసరం అనుకుంటే ఎంతటి విలువైన వస్తువునైనా వదిలేస్తారు. తాము అనుకున్న సిద్ధాంతం కోసం పని చేస్తారు. అందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు.
బి నెగెటివ్ (B-) – వీరికి స్వార్థం ఎక్కువ. ఎదుటి వారిని హింసించడమే పనిగా పెట్టుకుంటారు. ఏ విషయంలోనూ ఎవరితోనూ అస్సలు కాంప్రమైజ్ అవరు. సర్దుకుపోయే తత్వం అస్సలు ఉండదు. దేంట్లో అయినా కానీ ఇతరులతో పోటీ పడుతారు. తమకు నచ్చిందే చేస్తారు. అస్సలు కాంప్రమైజ్ కారు.
ఓ పాజిటివ్ (O+) – వీరు ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటారు. మెమొరీ షార్ప్‌గా ఉంటుంది. ఏ పనిని అయినా యాక్టివ్‌గా చేస్తారు. అంతే యాక్టివ్‌గా పని పూర్తి చేస్తారు. అందరితోనూ కలుపుగోలుతనంతో ఉంటారు. అయితే వీరిని అర్థం చేసుకోవడం మాత్రం ఇతరులకు సాధ్యమయ్యే పనికాదు. వీరిని ఎవరూ అసలు అర్థం చేసుకోలేరు.
ఓ నెగెటివ్ (O-) – వీరు సంకుచిత మనస్తత్వం కలిగి ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒకటి పోగొట్టుకున్నట్టు ఉంటారు. బాగా రిజర్వ్‌డ్ అయి ఉంటారు. ఎవరితోనూ అంత సులభంగా మాట్లాడరు. తమ గురించి తామే బాధపడుతుంటారు. చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి చూస్తారు.
ఏబీ పాజిటివ్ (AB+) – వీరికి దయ, జాలి గుణాలు ఎక్కువ. ఎంత సేపూ ఇతరులకు సహాయం చేయాలనే చూస్తారు. తమ గురించి తాము అంతగా పట్టించుకోరు. తోటి వారికి సహాయం చేయాలనే తపనను కలిగి ఉంటారు.
ఏబీ నెగెటివ్ (AB-) – వీరికి తెలివితేటలు ఎక్కువ. ఏ సమస్యను అయినా ఇట్టే పరిష్కరిస్తారు. అమోఘమైన ప్రతిభను ప్రదర్శిస్తారు. ఎలాంటి చాలెంజ్ అయినా సరే సులభంగా ఎదుర్కొంటారు. పని పూర్తి చేస్తారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…