ఆఫ్‌బీట్

P-Trap : వాష్ బేసిన్ కింద వైపు U షేప్‌లో పైపు ఉంటుంది.. మీరెప్పుడైనా గమనించారా..? ఎందుకుంటుందో తెలుసా..?

P-Trap : నిత్య జీవితంలో మ‌నం ఎన్నో వస్తువుల‌ను చూస్తుంటాం. వాటిని వాడుతుంటాం. కానీ వాటిని ఎలా త‌యారు చేశారు, అవి అలాగే ఎందుకు ఉన్నాయి, వేరే విధంగా ఎందుకు లేవు..? వ‌ంటి అంశాల‌ను అస‌లు గ‌మ‌నించం. కానీ స‌రిగ్గా గ‌మనిస్తే మ‌న‌కు అనేక వ‌స్తువుల గురించి అనేక విష‌యాలు తెలుస్తాయి. అలాంటి వ‌స్తువుల్లో వాష్ బేసిన్ సింక్ కింద ఉండే పైపు కూడా ఒక‌టి. అవును, క‌రెక్టే. వాష్ బేసిన్ లో ఉండే నీళ్ల‌ను అది కింద‌కు పంపుతుంది. అంతేక‌దా అది చేసే ప‌ని. అంతకు మించి వేరే ఏ ప‌ని దానికి ఉంటుంది చెప్పండి..? దాని గురించి తెలుసుకోవాల్సింది పెద్ద‌గా ఏముంటుంది..? అనే క‌దా మీరు అడ‌గ‌బోయేది. అయితే అవును, నిజంగా దాని గురించి తెలుసుకోవాల్సిన విష‌యం ఒక‌టుంది. అదేమిటంటే..

మీరెప్పుడైనా గ‌మ‌నించారా..? వాష్ బేసిన్ సింక్ కింద ఉండే పైపును. అవును, కొద్దిగా వంక‌ర‌గా తిరిగి అంటే.. ఆంగ్ల అక్ష‌రం U షేప్‌లో ఉంటుంది అది. అవును, అదే. అయితే ఆ పైపు అలా ఎందుకు ఉంటుందో తెలుసా..? దాన్ని U షేప్‌లోనే ఎందుకు త‌యారు చేశారో తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం. ఏమీ లేదండీ.. చిత్రంలో చూశారుగా U షేప్‌లో ఉండ‌డం వల్ల అందులో ఎప్పుడూ కొన్ని నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు ఏం చేస్తాయంటే.. పైపు కింద కు క‌నెక్ట్ అయి ఉండే డ్రైనేజీ నుంచి వ‌చ్చే దుర్వాస‌న‌ను నిరోధిస్తాయి. కింద డ్రైనేజీ నుంచి వ‌చ్చే గ్యాస్‌లు నేరుగా ఆ పైప్ ద్వారా పైకి రాకుండా ఉండేందుకు గాను మ‌ధ్య‌లో ఆ పైపుకు అడ్డుక‌ట్ట వేయాల్సి ఉంటుంది. అందుకే దాన్ని U షేప్ వ‌చ్చేలా త‌యారు చేశారు. దీని వ‌ల్ల అందులో ఎప్పుడూ కొంత నీరు ఆగి ఉంటుంది. క‌నుక కింది వైపు డ్రైనేజీ నుంచి వ‌చ్చే దుర్వాస‌న నీటి వ‌ద్ద ఆగిపోతుంది. దీంతో గ్యాస్ పైకి రాదు, మ‌న‌కు దుర్వాస‌న రాదు.

P-Trap

ఇలా U షేప్‌లో ఉండే ప్రాంతాన్ని పి ట్రాప్ (P-trap) అని అంటారు. ఈ ట్రాప్ గ‌న‌క డ్యామేజ్ అయితే అప్పుడు నీరు ఉండ‌దు క‌నుక దాన్నుంచి దుర్వాస‌న పైకి వ‌స్తుంది. అది ఇంట్లోకి వ్యాప్తి చెందుతుంది. కాబ‌ట్టి మీకు ఇంట్లో కిచెన్ వాష్ బేసిన్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందని అనిపించిన‌ప్పుడు ఒక‌సారి ఈ ట్రాప్‌ను చెక్ చేసుకోండి. డ్యామేజ్ ఉంటే రిపేర్ చేయించుకోండి. అయితే ఇలాంటి ట్రాప్‌లు టాయిలెట్ల‌లో టాయిలెట్ బేసిన్ కింద వైపు కూడా ఉంటాయి. దాని వ‌ల్ల కూడా మ‌న టాయిలెట్‌లోకి డ్రైనేజీ నుంచి దుర్వాస‌న రాకుండా ఉంటుంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM