సాధారణంగా మనం ఐరన్ వస్తువులను ఎక్కువగా గాలి, వెలుతురు తాకే చోట పెడితే తొందరగా అవి తుప్పుపట్టి నాశనమవుతాయి. ఇవి గాలిలో ఉన్న ఆక్సిజన్ తో చర్యలు జరిపి తుప్పు పట్టడానికి కారణమవుతాయి. ఈ క్రమంలోనే రైలు పట్టాలను కూడా ఇనుముతోనే తయారు చేస్తారు కదా. మరలాంటప్పుడు అవి నిత్యం వెలుతురు, గాలి తాకే ప్రదేశాలలో ఉన్నప్పటికీ ఎందుకు తుప్పు పట్టవు ? అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. మరి రైలు పట్టాలు తుప్పు పట్టకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..
సాధారణంగా మనం సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. కనుక రైలు పట్టాలను నిర్మించేటప్పుడు ఎంతో నాణ్యమైన ఉక్కును ఉపయోగిస్తారు. ఈ ఉక్కులో 1% కార్బన్, 12% మాంగనీస్ కలిపి తయారు చేస్తారు. అందుకే వీటిని ‘సీ-ఎంఎన్’ రైల్ స్టీల్ అని కూడా అంటారు. ఎంతో
నాణ్యమైన ఉక్కుతో తయారు చేస్తారు కనుక సంవత్సరానికి 0.05 మి.మీ మాత్రమే తుప్పు పడుతుంది కాబట్టి 1 మి.మీ. రైల్ ట్రాక్ తుప్పు పట్టడానికి సుమారుగా 20 సంవత్సరాల కాలం పడుతుంది. అందుకనే ఎక్కువ ఏళ్ల పాటు పట్టాలు గాలి, వెలుతురులో ఉన్నా.. అవి తుప్పు పట్టవు. అవి తుప్పు పట్టకపోవడానికి గల కారణం ఇదే.
ఇక రైలు కింద అధిక ఒత్తిడికి రైలు పట్టాలు గురవుతాయి కనుక ఎప్పుడైనా, ఎక్కడైనా రైలు పట్టాలు పాడైనట్టు అనిపించినా వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యి వెంటనే వాటిని తొలగించి కొత్తవి వేస్తారు. అదే విధంగా రైల్వే ట్రాక్ తుప్పు పట్టకుండా కోటింగ్ వేస్తారు కనుక రైలు పట్టాలు త్వరగా తుప్పు పట్టవు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…