ఆఫ్‌బీట్

బాహుబ‌లి సినిమాలో దీన్ని మీరు చూసే ఉంటారు క‌దా.. ఇదేమిటో.. ఏం ప‌నిచేస్తుందో తెలుసా..?

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బాహుబ‌లి మూవీలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇందులో న‌టించిన అంద‌రికీ ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపు వ‌చ్చింది. ప్ర‌భాస్‌, రానా నేష‌న‌ల్ స్టార్స్ అయ్యారు. వారి మార్కెట్ కూడా పెరిగింది. అయితే బాహుబ‌లి మూవీ గురించి ఎన్ని విష‌యాల‌ను తెలుసుకుంటున్నా ఇంకా మ‌న‌కు తెలియ‌ని ఎన్నో విష‌యాలు అందులో ఉంటూనే ఉన్నాయి. ఏదో ఒక విష‌యం గురించి మ‌న‌కు తెలుస్తూనే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా అలాంటిదే మ‌రొక విష‌యం గురించి తెలుసుకుందాం.

బాహుబ‌లి మూవీలో యుద్ధం సీన్ల స‌మ‌యంలో చిత్రంలో ఇచ్చిన ప‌రిక‌రాన్ని మీరు చూసే ఉంటారు. శ‌త్రువుల మీద‌కు భారీ గుండ్ల‌ను వ‌దిలేందుకు దీన్ని వాడ‌తారు. అయితే దీని గురించిన పూర్తి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని కాటాపుల్ట్ (catapult) అంటారు. అప్పటి వరకు కత్తులు కటార్లతోనే సాగుతున్న యుద్ధం వీటి రాకతో కొత్త టర్న్ తీసుకుందనే చెప్పాలి. ఈ యుద్ధ పరికరం సహాయంతోనే మగధ రాజైన అజాతశత్రు లిచ్చావీ రాజ్యాన్ని సునాయాసంగా ఓడగొట్టాడు. అప్పటి వరకు పాశ్చాత్య‌ దేశాలకే తెలిసిన ఈ కొత్త ఆయుధాన్ని మన దగ్గర ప్రవేశపెట్టాడు అజాతశత్రు.

పంగల కర్ర (ఉండేలు) కాన్సెప్ట్ తో తయారు చేసిన ఈ పరికరంలో మొదట తాడును, తర్వాత ఎలాస్టిక్ ను, తర్వాత స్ప్రింగ్స్ ను ఉపయోగించి పెద్ద పెద్ద బండరాళ్లను శత్రువుల పైకి విసిరేవారు. దీంతో శత్రు మూక చెల్లాచెదురయ్యేది. తర్వాత రాళ్లకు బదులు పేలుడు పదార్థాలు వాడారు. ఫిరంగుల‌ రాకతో వీటి ఉపయోగం తగ్గిపోయింది. ఎంటర్టైన్మెంట్ కోసం కూడా దీని ఉపయోగించేవారు. దూరంగా వలను ఏర్పాటు చేసి ఇందులోనుండి మనిషిని వల లోకి విసిరేసేవారు. నీటి జలాశయాల్లోకి కూడా వీటిలో కూర్చున్న మనుషులను విసిరేసేవారు. మొదట్లో దూరం అంచనా సరిగ్గా లేక కొంద‌రు చ‌నిపోయారు కూడా. త‌రువాత దీన్ని అలా ఉప‌యోగించ‌డం మానేశారు. ఇక చాలా రాజుల విజయాల్లో కీలకపాత్ర పోషించి ఈ పరికరం బాహుబలి సినిమా ద్వారా మరోసారి మ‌న‌కు కనిపించింది.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM