ఆఫ్‌బీట్

ఇతరులకు చెందిన ఈ వస్తువుల‌ను ఎప్పటికీ వాడకూడదు.. ఎందుకో తెలుసా..?

పురాత‌న కాలం నుంచి భార‌తీయుల్లో ప‌లు అంశాల ప‌ట్ల విశ్వాసాలు ఉన్నాయి. అది అలా చేయ‌కూడ‌దు, ఇది ఇలా చేయాలి, అక్క‌డ అలా ఉండ‌కూదు, ఇది ఆ స‌మ‌యంలో తిన‌కూడ‌దు, అలా చేయాలి, ఇది చేయ‌కూడ‌దు.. ఈ విధంగా అనేక అంశాల ప‌ట్ల ఆయా వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌మ విశ్వాసాల‌ను ఇప్ప‌టికీ కొన‌సాగిస్తూనే ఉన్నారు. అయితే అలాంటి విశ్వాసాల‌ను కొంద‌రు మూఢ న‌మ్మ‌కాలుగా కొట్టి పారేస్తారు. కొంద‌రు బాగా న‌మ్ముతారు. అది వేరే విష‌యం. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా దాదాపుగా అలాంటి విష‌య‌మే.

ఒక‌రు వాడిన వ‌స్తువులు మ‌రొక‌రు వాడ‌కూడ‌ద‌ని సైన్స్ కూడా చెబుతోంది. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే మ‌నం ఉప‌యోగించే కొన్ని వ‌స్తువుల‌ను మాత్రం ఇత‌రుల‌కు ఇవ్వ‌కూడ‌ద‌ట‌. మ‌నం కూడా ఇత‌రుల‌కు చెందిన ఆ వ‌స్తువుల‌ను వాడ‌కూడ‌ద‌ట‌. లేదంటే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. ఇంత‌కీ మ‌నం వాడకూడ‌ని ఇత‌రులకు చెందిన ఆ వ‌స్తువులేమిటో తెలుసా..? తెలుసుకుందాం రండి.

మంచం.. అవును. మ‌నం ఇత‌రుల మంచంపై ప‌డుకోకూడ‌ద‌ట‌. అలాగే ఇత‌రుల మంచంపై నిద్రించ‌కూడ‌ద‌ట‌. లేదంటే వారిలోని వైబ్రేష‌న్స్ మ‌న‌కు వ‌స్తాయ‌ట‌. ఆ క్ర‌మంలో మ‌న‌కు ఆర్థిక స‌మ‌స్య‌లు కూడా ఎదుర‌వుతాయ‌ట‌. అంతేకాదు ఆరోగ్యం కూడా బాగుండ‌ద‌ట‌. క‌నుక ఇత‌రుల మంచాల‌పై నిద్రించ‌రాదు. ఇక సాధార‌ణంగా స్నేహితులు, కుటుంబ స‌భ్యులు లేదా బంధువుల్లో మ‌నం మ‌న శ‌రీరానికి త‌గిన‌ట్టుగా ఉండే ఇత‌రుల దుస్తుల‌ను ఎక్కువ‌గా ధ‌రిస్తాం. అయితే అలా ఒక‌రి దుస్తుల‌ను మ‌రొక‌రు ధ‌రించ‌కూడ‌ద‌ట‌. అలా చేస్తే జీవితంలో అన్నీ స‌మ‌స్య‌లే ఎదుర‌వుతాయ‌ట‌.

ఇత‌రుల డ‌బ్బుపై ఎప్పుడూ క‌న్నేసి ఉండే వారికి ఎప్పుడూ దుర‌దృష్ట‌మే వ‌స్తుంద‌ట‌. అందుకే మ‌నం మ‌న‌కు ఉన్న దాంట్లోనే సంతృప్తి ఉండాల‌ట‌. ఇత‌రుల‌కు ఉన్న దాని గురించి మ‌నం ఆలోచించ‌కూడ‌ద‌ట‌. అప్పు తీసుకున్నా, అప్పు ఇచ్చినా వెంట‌నే రుణ భారం తీర్చేసుకోవాల‌ట‌. ఒక‌రి వ‌ద్ద ఉన్న పెన్నును మ‌రొక‌రు తీసుకుని వాడ‌డం మ‌నం చాలా సంద‌ర్భాల్లో చూస్తుంటాం. ముఖ్యంగా బ్యాంకుల్లో ఇలా ఎక్కువ‌గా చేస్తుంటారు. అయితే ఇలా ఒక‌రి పెన్ను తీసుకుని వాడితే ఆర్థిక స‌మ‌స్య‌లు క‌లుగుతాయ‌ట‌. అందుక‌ని అలా కూడా చేయ‌కూడ‌దు. అలాగే ఇత‌రుల రిస్ట్ వాచీల‌ను అస్స‌లు ధ‌రించ‌కూడ‌ద‌ట‌. అలా ధ‌రిస్తే వారిలో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ మ‌న‌కు వ‌స్తుంద‌ట‌. దీంతోపాటు ఆర్థిక స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయ‌ట‌. క‌నుక ఇత‌రు వాచ్‌ల‌ను మ‌నం ధ‌రించ‌రాదు. ఇలా ఇత‌రులు వాడే ప‌లు వ‌స్తువుల‌ను మ‌నం అస‌లు ఎన్న‌టికీ వాడ‌కూడ‌దు. వాడితే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయ‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM