Yashoda Movie : నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం సమంత చేసిన తొలి స్ట్రెయిట్ చిత్రం.. యశోద. ఆమె నటించిన కాతువాకుల రెండు కాదల్ అనే మూవీ కూడా విడాకుల తరువాతే రిలీజ్ అయింది. కానీ అది తమిళ చిత్రం. తెలుగులోనూ డబ్బింగ్ చేశారు. అయితే ఇక్కడ ప్రమోషన్స్ అంతగా చేయలేదు. దీంతో తెలుగులో ఈ మూవీ ఫ్లాప్ అయింది. తమిళంలో మాత్రం మంచి విజయాన్నే సాధించింది. ఆ తరువాత యశోద మూవీ వచ్చింది. ఇది స్ట్రెయిట్ తెలుగు మూవీ. అయితే యశోద మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. దీంతో సమంతకు కాస్త ఊరట లభించినట్లు అయింది.
అయితే యశోద మూవీ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో యశోద డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో అమెజాన్‌లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 9న అమెజాన్‌లో విడుదలవుతుందని ఒక ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే ఈ మూవీ ఆ యాప్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. సైన్స్ ఫిక్షన్, మిస్టరీ, థ్రిల్లర్ కథాంశంతో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సమంత నటనకు ప్రేక్షకుల ప్రశంసలు దక్కాయి.
ఇక సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. యశోద రిలీజ్‌కు ముందు ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో అందరూ ఆందోళన చెందారు. అయితే ఆమె పరిస్థితి క్రిటికల్‌గా ఉందని.. దీంతో ట్రీట్‌మెంట్ కోసం అమెరికాకు వెళ్లిందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఆమె టీమ్ ఖండించలేదు. స్పందించలేదు. సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి అనే మూవీలో నటిస్తుండగా.. ఈ మూవీ జమ్మూ కాశ్మీర్ లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. సమంతకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో మూవీ షూటింగ్‌ను ఆపివేశారు. అలాగే శాకుంతలం అనే ఇంకో మూవీలోనూ సమంత నటించగా.. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీని రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…