Mohan Babu : తెలుగు సినీ ప్రేక్షకులకు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కలెక్షన్ కింగ్‌గా, నట ప్రపూర్ణగా తెలుగు ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నారు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి అలరించారు. ఈయన కెరీర్ మొదట్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. తరువాత హీరో అయ్యారు. అప్పట్లో ఈయన నటించి అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్లాం తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సాధించాయి. అలాగే ఈయన రజనీకాంత్‌తో కలిసి చేసిన పెదరాయుడు సినిమా కూడా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.
అయితే మోహన్ బాబు నటుడిగా ఎంత పేరు తెచ్చుకున్నారో.. వివాదాల వద్ద ఆయన అన్ని విమర్శల పాలయ్యారు కూడా. ఇప్పటికే ఆయన సినిమా కెరీర్‌లో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన షూటింగ్‌లో ఉన్నారంటే.. అందరూ బిక్కు బిక్కుమంటూ ఉంటారట. ఏం చేసినా ఆయన విపరీతంగా కోపం తెచ్చుకుంటారని.. అవసరం అయితే చెంప చెళ్లుమనిపిస్తారని కూడా ఆయన మీద విమర్శలు ఉన్నాయి. అందుకనే ఆయనతో సినిమా అంటే చాలా మంది నటీనటులు జంకుతుంటారట.
ఇక మోహన్ బాబు సినిమా కెరీర్‌లో ఎన్నో వివాదాలు ఉన్నప్పటికీ ఒక సంఘటన మాత్రం ఆయన జీవితంపై మాయని మచ్చను వేసింది. అప్పట్లో యమజాతకుడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిందీ సంఘటన. హీరోయిన్ సాక్షి శివానంద్. మూడు రోజుల పాటు షూటింగ్ కూడా అయింది. అయితే ఒక హోటల్ లో ఉదయం షూటింగ్ సమయంలోనే సాక్షి శివానంద్ సెట్‌కు వస్తూనే మోహన్ బాబును తీవ్రంగా దూషిస్తూ.. ఆయనను దారుణంగా అవమానించిందట. పెద్దగా అరుస్తూ కేకలు పెట్టిందట.
తాను హోటల్‌లో ఉన్న గదికి మోహన్ బాబు వచ్చారని, ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించారని, అత్యాచారం చేసేందుకు యత్నించారని.. ఆరోపిస్తూ సాక్షి శివానంద్ ఆయనపై దారుణమైన ఆరోపణలు చేసింది. అయితే దీనికి కోపంతో ఊగిపోయిన మోహన్ బాబు ఆమెను తిడుతూ ఆమెపై చేయి చేసుకున్నారట. దీంతో ఆమె పోలీసులకు కంప్లెయింట్ ఇస్తానని చెబితే.. వెంటనే నాగార్జున రంగంలోకి దిగి ఆమెను బుజ్జగించారట. ఇక ఆ తరువాత ఆమె శాంతించి కొన్ని కండిషన్ల నడుమ ఎలాగో షూటింగ్‌ను పూర్తి చేసింది.
తరువాత సాక్షి శివానంద్ మళ్లీ మోహన్ బాబు సినిమాల్లో చేయలేదు. ఆ తరువాత తెలుగులోనూ ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అనంతరం ఈమె సినిమా కెరీర్‌కు గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. అయితే మోహన్ బాబు సినిమా కెరీర్‌లో ఎన్నో వివాదాలు ఉన్నప్పటికీ ఈ ఒక్క సంఘటన మాత్రం ఆయన జీవితంపై మాయని మచ్చలా మిగిలిపోయిందని చెప్పవచ్చు. ఆయన అప్పట్లో ఈ సంఘటన వల్ల దారుణంగా విమర్శల పాలయ్యారు. కానీ తరువాత అంతా సద్దుమణిగింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…