Viral Video : బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మనం చాలా ఆచి తూచి వ్యవహరించాలి. ముఖ్యంగా మన సామాన్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. బంగారం, ఫోన్లు, ఇతర విలువైన వస్తువులు ఏవి మన దగ్గర ఉన్నా సరే.. వాటిని ఎల్లప్పుడూ ఓ కంట కనిపెడుతుండాలి. లేకపోతే చోరాగ్రేసరులు ఉంటారు.. వారు ఎలా దొంగతనం చేస్తారంటే.. అసలు మనల్ని టచ్ చేసినట్లు కూడా మనకు తెలియదు. అంత చాకచక్యంగా మన దగ్గర ఉన్న వస్తువులను కొట్టేస్తారు. సరిగ్గా ఓ మహిళా కూడా ఇలాగే చేసింది. తన పక్కనే ఉన్న ఇంకో మహిళ హ్యాంగ్ బ్యాగ్ నుంచి చాలా తెలివిగా ఫోన్‌ను కొట్టేసింది. తరువాత ఎంచక్కా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
వైరల్ వీడియోలో ఉన్న ప్రకారం.. ఓ రద్దీగా ఉన్న షాపులో ఓ మహిళ నిలబడి ఉంది. అక్కడికి వచ్చిన పింక్ కలర్ చుడీదార్ ధరించిన ఓ మహిళ తన పక్కనే ఉన్న మహిళను వస్తూ వస్తూనే పక్కన ఢీకొడుతూ నిలుచుంది. దీంతో ఆమె పింక్ కలర్ చుడీదార్ మహిళను ఒక్కసారిగా అలా చూసింది. అయితే ఆ ఆంటీ తన పక్కనున్న మహిళను తాకుతూ నిలుచుని ఏదో ఆర్డర్ చేసినట్లు నటించింది. తరువాత ఆ మహిళ ఏమరుపాటుగా ఉన్నప్పుడు వెంటనే తన ఎడమ చేతిని ఉపయోగించి ఆ మహిళ బ్యాగ్‌లో ఉన్న ఫోన్‌ను కొట్టేసి తన బ్యాగ్‌లో వేసుకుంది. ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది.
అయితే ఆ పక్కనే ఉన్న మహిళ తన బ్యాగ్‌ను ఎవరో టచ్ చేశారని అనిపించి ఒక్కసారి చూసుకుంది. కానీ అప్పటికే ఆ ఆంటీ ఆమె ఫోన్‌ను కొట్టేసింది. ఈ క్రమంలోనే ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో ఆ ఆంటీ నేర్పరితనం చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఆమెను అలా చూసి నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు. మన చుట్టూ ఉన్నవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే ఇలాగే జరుగుతుందని అంటున్నారు. ఇక ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…