Radhe Shyam : బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. అయితే బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే కథా చిత్రాలలో నటించడంలేదని ప్రేక్షకులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సాహో చిత్రం చూస్తున్నంత సేపూ ఏదో హాలీవుడ్ సినిమాలను తలపించింది తప్ప అందులో ఉన్న కథాంశం ఏంటి అనేది మాత్రం ప్రేక్షకులకు అవగాహన కాలేదు. ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన సాహో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక సాహో సినిమా తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రాధేశ్యామ్.
ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచుతున్నప్పటికీ ఈ సినిమా కథాంశం ఏంటి అనేది మాత్రం ప్రేక్షకులకు అవగాహన కాదని అంటున్నారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు అసలు ఈ సినిమా కథ అర్థం అవుతుందా, లేదా.. అన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీపై ప్రేక్షకుల్లో మాత్రం భారీ అంచనాలు ఉన్నప్పటికీ విడుదలయ్యాక పరిస్థితి ఏమిటన్నది తెలియాల్సి ఉంది.
సాహో మూవీ కూడా టీజర్, ట్రైలర్, పోస్టర్‌లతో అదరగొట్టేశారు. ఇప్పుడు రాధేశ్యామ్ కూడా ఇలాగే జరుగుతోంది. అయితే సాహోలో చివరి సీన్ వరకు కథ ఏమిటన్నది తెలియదు. దీంతో ప్రేక్షకులకు తాము అసలు చూస్తుంది సినిమాయేనా అన్న భావన కలిగింది. ఆ మూవీ అంతగా నడవకపోవడానికి గల కారణం.. సాహోలో కథను సరిగ్గా చెప్పకపోవడమే అని చెప్పవచ్చు. దీంతో ఎన్ని యాక్షన్ సీన్లు ఉన్నా.. కథను ముందు చెప్పని కారణంగా ఆ సినిమా యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఇక ఇప్పుడు రాధేశ్యామ్ కూడా సాహోలాగే ఉంటుందా ? అన్నది సందేహంగా మారింది. ఎందుకంటే.. రాధేశ్యామ్‌లో ప్రభాస్ పామిస్ట్‌గా కనిపించబోతున్నట్లు టాక్. ఈ తరహా సినిమాలు హాలీవుడ్‌లో బాగానే నడుస్తాయి. కానీ తెలుగు ప్రేక్షకులకు కథ ప్రథమార్థంలో చెబితే తప్ప అర్థంకాదు. మరి రాధేశ్యామ్ కథ అర్థమవుతుందా, లేదా.. అన్నది తెలియాలంటే.. సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడక తప్పదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…