Black Thread : ప్రస్తుత తరుణంలో చాలా మంది కాళ్లకు నల్లదారం కట్టుకుంటున్న విషయం విదితమే. కాలి మడమల దగ్గర నల్లని దారాన్ని కట్టుకుంటున్నారు. సెలబ్రిటీలు ఎక్కువగా ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు. దీంతో వారిని చూసి ఫ్యాన్స్ కూడా ఇలా కట్టుకుంటున్నారు. ఇలా కాళ్లకు నల్ల దారం కట్టుకోవడం అనేది ఎక్కువైంది. అయితే దీన్ని చాలా మంది ఫ్యాషన్ కోసం కట్టుకుంటున్నారు. కానీ దీంతో వాస్తవానికి ఆధ్యాత్మిక పరంగా పలు లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కాళ్లకు నల్లనిదారం కట్టుకోవడం అనేది ఇప్పుడు కాదు, ఎంతో పురాతన కాలం నుంచి ఉన్నదే. కాళ్లకు నల్లని దారం కట్టుకోవడం వల్ల దిష్టి తగలకుండా ఉంటుంది. నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో లక్ కలసి వస్తుంది. అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి. ఇతరుల చూపు మనపై ఉండదు. ఎవరైనా మన ఎదుగులను చూసి ఓర్వలేక అసూయ చెందితే అప్పుడు నల్లనిదారం రక్షణగా పనిచేస్తుంది. దీంతో వారి దిష్టి మనకు తగలకుండా ఉంటుంది. ఇదీ.. నల్లని దారం కట్టుకోవడం వెనుక ఉన్న అసలు విషయం.
ఇక నల్లనిదారాన్ని కేవలం కాళ్లకే కాదు, నడుముకు మొలతాడు రూపంలోనూ ధరిస్తారు. దీని వల్ల కూడా దిష్టి నుంచి తప్పించుకోవచ్చు. అలాగే నల్లనిదారం చల్ల దనాన్ని గ్రహిస్తుంది. దీంతో జననావయవాలు చల్లగా ఉంటాయి. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి.
నడుముకు మొలతాడు రూపంలో నల్లని దారం కట్టుకోవడం వల్ల నడుం చుట్టు కొలత ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. దీంతో అధికంగా బరువు పెరగకుండా చూసుకోవచ్చు. ఇక నల్లనిదారాన్ని చేతులకు, భుజాలకు కూడా కట్టుకోవచ్చు. నల్లనిదారాన్ని ఫ్యాషన్ కోసం కాకుండా దిష్టి తగలకుండా ఉండేందుకు ధరించవచ్చు. దీంతో నెగెటివ్ ఎనర్జీ నుంచి, దుష్ట శక్తుల ప్రభావం నుంచి కూడా తప్పించుకోవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ నల్లనిదారం ధరించాలి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…