Tollywood : ప్రస్తుతం టాలీవుడ్ సినీ హీరోలకు వరుసగా యాక్సిడెంట్స్, షూటింగ్ లలో దెబ్బలు, పలు రకాల తీవ్రమైన జ్వరాలతో.. ఒకరి తర్వాత మరొకరు హాస్పిటల్ పాలవుతున్నారు. ఇండస్ట్రీకి ఇదేమైనా శాపమా అనే అనుమానం రేకెత్తుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోల్ని వెంటాడుతున్న ఈ సమస్య ఏంటో అంటూ.. నెటిజన్లు సైతం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సరిగ్గా వినాయకచవితి నాడు బైక్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయాలయిన సాయి తేజ్ స్పృహ కోల్పోయి మరీ హాస్పిటల్ చేరారు.
ఆయన ఆరోగ్యంపై వైద్యులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తూనే ఉన్నారు. రీసెంట్ గా తన ఆరోగ్యం బాగానే ఉంది.. తనను, తన సినిమాను ఆదరించినవారందరికీ థ్యాంక్స్ చెబుతూ, త్వరలోనే వచ్చేస్తానంటూ ఓ ఫోటోను సాయి ధరమ్ తేజ్ షేర్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. డెంగ్యూ ఫీవర్ తో ప్లేట్ లెట్స్ డౌన్ అయ్యి రెండు వారాలుగా హాస్పిటల్ లో అడ్మిట్ అయిన అడివి శేష్ ఆరోగ్యంపై కూడా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.
ఆయన కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇక్కడ అంతా క్షేమం.. అంటూ సన్ ఫ్లవర్ లుక్ లో పోస్ట్ చేశారు. దాంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత హీరో సిద్ధార్ధ్ కు కూడా మహాసముద్రం షూటింగ్ లో గాయాలు అయ్యాయి. సర్జరీ కూడా చేయించుకోవాల్సి వచ్చింది. రెపో 19 సినిమా షూటింగ్ లో రామ్ పోతినేనికి సైతం మెడకు గాయం అవ్వడంతో ఇక ఈ విషయంలో అభిమానులు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు ఏంటి.. అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఏదైనా గండం ఉందా.. అంటూ రియాక్ట్ అవుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…