Ram Charan : సాధారణంగా ఎవరైనా సరే ఒక రంగంలో దూసుకుపోతున్నాడంటే అతనిపై ఎన్నో కళ్లు ఉంటాయి. కొందరు అలాంటి వారిని ప్రోత్సహిస్తుంటారు. కానీ కొందరు మాత్రం అలాంటి వారంటే ఎల్లప్పుడూ అసూయను పెంచుకుంటారు. సరిగ్గా రామ్ చరణ్ పరిస్థితి కూడా ఇలాగే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్‌తో పాన్ ఇండియా స్థాయి హీరోగా మారిన చరణ్.. పలువురు ప్రముఖ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తుండగా.. త్వరలోనే ప్రశాంత్ నీల్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నాడు. అయితే చరణ్ కోసం చిరంజీవి ఇంకో ప్రముఖ దర్శకున్ని కూడా లైన్‌లో పెట్టారట. దీంతో చరణ్ పై కొందరు అసూయగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా పాన్ ఇండియా స్టేటస్ ను చరణ్ దక్కించుకున్నాడు. గతంలో బాహుబలి ద్వారా ప్రభాస్‌కు కూడా ఇలాగే జరిగింది. అందుకనే ఆయన ఆ స్టేటస్ ను నిలబెట్టుకునేందుకు భారీ చిత్రాలనే చేస్తున్నారు. ఇక చరణ్ కూడా అదే బాటలో ప్రయాణం చేస్తున్నాడు. అందుకు ఆయనను తప్పుబట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒక భారీ చిత్రం తరువాత అలాంటి చిత్రాన్నే ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కనుకనే చరణ్ వరుసగా ప్రముఖ దర్శకులతో భారీ చిత్రాలను చేస్తున్నారు. అయితే శంకర్, కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ తరువాత చరణ్ లోకేష్ కనకరాజ్‌తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
కమలహాసన్ నటించిన విక్రమ్ సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తాజాగా చిరంజీవిని కలిశారు. ఈ క్రమంలోనే చిరంజీవి ఓ వైపు సల్మాన్ ఖాన్‌తోపాటు కమల హాసన్, లోకేష్ కనకరాజ్‌ను కూడా సన్మానించారు. అయితే చరణ్‌తో ఓ సినిమా చేయాలని.. చిరు.. కనకరాజ్‌ను అడిగారట. దీంతో ఇందుకు ఆయన ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే చరణ్ చేయనున్న వరుస సినిమాలు అన్నీ భారీ స్థాయిలోనే ఉండనున్నాయి. అయితే ఇతర హీరోలకు దక్కకుండా ఇలా చిరంజీవి తన కొడుకు కోసం ప్రముఖ దర్శకులను లాక్ చేయడం ఏమీ బాగాలేదని కొందరు అంటున్నారు. కానీ చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తన కొడుకు కోసం ఆయన అలా చేస్తున్నారని.. ఇందులో తప్పేముందని అంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు చరణ్‌పై ప్రస్తుతం గుర్రుగా ఉన్నారని.. ఆయనంటే అసూయను కనబరుస్తున్నారని తెలుస్తోంది. అయితే చరణ్ తీయనున్న ఆ మూడు సినిమాలు ఎలాంటి ప్రదర్శనను ఇస్తాయో చూడాలి. చిరంజీవి చేస్తున్న కృషి ఫలిస్తుందా.. లేదా.. అన్నది.. వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…