NTR : ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో పలకరించిన ఎన్టీఆర్ త్వరలో తన 30వ సినిమాలో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ అయ్యప్ప మాల ధరించగా, ఎన్టీఆర్ హనమాన్ దీక్ష తీసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తర్వాత తారక్ మాలధారణ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అన్నట్టుగానే జూనియర్ ఆంజనేయ స్వామి దీక్ష తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. తొలిసారి ఎన్టీఆర్ స్వామి మాల ధరించగా, ఇంత సడెన్‌గా ఆయన దీక్ష ఎందుకు తీసుకున్నారనే ఆతృత అందరిలోనూ ఉంది.
ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు రామ్ చరణ్ ఇప్పుడు గురు స్వామి అయ్యారు. మరి ఆయన ఏమన్నా సూచించారా ? ఈ దీక్ష చేస్తే మంచిది అని ? ఎన్టీఆర్ తల్లి, భార్య కూడా దైవ భక్తి విషయంలో కాస్త గట్టి నమ్మకాలు ఉన్నవారే కాబట్టి వారేమైనా చెప్పారా ? లేదంటే ఎన్టీఆర్ జాతకరీత్యా ఎవరైనా పండితులైనా చెప్పి ఉంటారా.. అనే చర్చ ఇప్పుడు టాలీవుడ్‌లో నడుస్తోంది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఎన్‌టీఆర్ తన జాతకంలో ఉన్న దోషాల కారణంగానే హనుమాన్ దీక్ష చేపట్టారని.. దీంట్లో కుటుంబ సభ్యుల ఒత్తిడి కూడా కొంత మేర ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఇదే విషయం హాట్ టాపిక్ అవుతోంది. ఇక దీక్ష పూర్తయిన తర్వాత ఎన్టీఆర్.. కొరటాల మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.
ఇంత వరకూ కెరీర్ లో ఫ్లాప్ అనే మాట తెలియని దర్శకుడు కొరటాల. ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఆయన పక్కాగా స్కెచ్ వేసుకున్నారట. గతంలో ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమాను తీసి భారీ సక్సస్ అందుకున్నాడు. ఆచార్య ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ సినిమా గురించి రకరకాల ప్రశ్నలు కొరటాలకు ఎదురవుతున్నాయి. వీటిపై టాలీవుడ్ డైరెక్టర్ స్పందిస్తూ.. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ నుంచి షూటింగ్ మొదలవుతుందన్నారు కొరటాల శివ.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…