Aditya 369 : నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో పేరు సంపాదించిన హీరో బాలకృష్ణ ఒక్కరే. ఆయన తనయుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ వెనుతిరిగి చూసుకోలేదు. బాలనటుడి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నో పాత్రలను పోషించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. జానపదం, పౌరాణికం, సాంఘికం, చారిత్రకం, సైన్స్ ఫిక్షన్, ఫ్యాక్షనిజం ఇలా ఎన్నో వైవిధ్యమైన కథల్లో నటించి హిట్లు కొట్టిన ఘనత బాలయ్యకే దక్కుతుంది.
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో అత్యంత భారీ విజయాలు సాధించిన సినిమాల్లో ఆదిత్య 369 సినిమా కూడా ఒకటి. ఈ సినిమా కథ కూడా అప్పటిలో ఒక సంచలనం అనే చెప్పాలి. ఆదిత్య 369 సినిమా తర్వాత బాలయ్య కెరీర్ చాలా స్పీడ్ గా ముందుకు దూసుకుపోయింది. ఈ సినిమా తరువాత సక్సెస్ ఫుల్ దర్శకులు ఎందరో బాలకృష్ణ డేట్స్ కోసం క్యూ కట్టారు.
అలాంటి ఈ అద్భుతమైన చిత్రంలో సినీ ప్రముఖులకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. గాన గంధర్వుడు ఎస్. పి. బాలసుబ్రమణ్యం ఒకసారి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తో మాట్లాడుతూ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దగ్గర ఉన్న టైం ట్రావెల్ కథ చెప్పడం, ఆ తర్వాత ఆ సినిమా చేయడానికి నిర్మాత ఒకే చెప్పడం జరిగాయట. ఆ తర్వాత కృష్ణదేవరాయల కాలం అనగానే బాలకృష్ణ గుర్తుకు రావడం, ఆయన వద్దకు వెళ్లి కథ గురించి చర్చలు జరపటం, బాలయ్య కూడా ఒకే చెప్పడంతో సినిమా షూటింగ్ పనులు స్టార్ట్ చేయడం జరిగిందట.
మొదట్లో ఈ సినిమాకి సుమారు 1 కోటి 30 లక్షలు రూపాయలు అవుతుందని దర్శక నిర్మాతలు అంచనా వేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా బడ్జెట్ మరో 30 లక్షలు అదనంగా ఖర్చు చేయడం జరిగింది. ఇక షూటింగ్ లో వేసిన సెట్లు, వాటికి కలిగిన ఆదరణ చూసి డిస్ట్రిబ్యూటర్లు సైతం ఎక్కువ ఖర్చు చేయడానికి రెడీ గా ముందుకు వచ్చారట. దీనితో సినిమాకు ఒక కోటి 52 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించడం జరిగింది.
మొదట్లో ఈ సినిమాకు యుగపురుషుడు, ఆదిత్యుడు, శ్రీ కృష్ణ దేవరాయలు అనే పేర్లు అనుకోవటం జరిగింది. కానీ చివరికి ఆదిత్య అని పేరు పెట్టి టైం ట్రావెలింగ్ కాబట్టి 369 అనే అంకెలను జత చేయడం జరిగింది. ఇలా ఈ సినిమా జూలై 18, 1991 న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైం ట్రావెల్ అనే కొత్త కథాంశం కావడంతో అప్పటిలో ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రం నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అదేవిధంగా ఈ సినిమాకు ముందుగా హీరోయిన్ గా విజయశాంతిని అనుకోవడం జరిగిందట. కానీ ఆమె అప్పటికే వేరే చిత్రాలతో బిజీ ఉండటంతో మోహిని హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…