Akhanda Movie : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో వచ్చిన మరో చిత్రం అఖండ.. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. కోవిడ్ రెండో దశ తరువాత థియేటర్లు తెరుచుకోగా.. అనేక సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇక అఖండ మూవీ కూడా రికార్డులను కొల్లగొట్టే దిశగా మంచి కలెక్షన్లను సాధిస్తూ దూసుకుపోతోంది.
అయితే అఖండ సినిమాను చూస్తూ బాలకృష్ణ అభిమాని, ఎగ్జిబిటర్ అయిన జాస్తి రామకృష్ణ (49) మృతి చెందారు. రాజమండ్రిలో సినీ ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ సినీ ఎగ్జిబిటర్ జాస్తి రామకృష్ణ (49) మృతి చెందారు. శ్యామల థియేటర్‌లో అఖండ సినిమా చూస్తుండగా ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆయన చనిపోయారు. ఈ క్రమంలో ఆయన మృతికి కారణాలు ఏమై ఉంటాయోనని వైద్యులు పరీక్షలు చేస్తున్నారు.
ఇక అఖండ మూవీకి థమన్ మ్యూజిక్ అందించగా.. కొన్ని థియేటర్లలో థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు సౌండ్ బాక్స్‌ల నుంచి పొగలు వస్తున్నాయని.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే చాలాకాలం తరువాత బాలయ్యకు మళ్లీ అఖండ రూపంలో మంచి హిట్ వచ్చింది. కానీ ఏపీలో టిక్కెట్ల రేట్లు తక్కువగా ఉండడం, అదనపు షోలకు అనుమతి లేకపోవడంతో.. ఆ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడుతుందని అంటున్నారు. ఒకవారం ఆగితేనే గానీ అసలు విషయం తెలియదని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…