Trees : ఇంటి పరిసరాల్లో ఎలాంటి మొక్కల‌ను పెంచాలి.. ఏ మొక్కలు ఉంటే ధ‌నం, శాంతి ల‌భిస్తాయో తెలుసా..?

Trees : సృష్టిలో ప్రాణమున్న ప్రతి ప్రాణికి వాస్తు చాలా అవసరం. మామూలుగా వచ్చే ఫలితాల కంటే వాస్తు ప్రకారం కచ్చితమైన దశ, దిశ తెలుసుకొని మనం నడుచుకుంటే అన్నీ శుభఫలితాలే కలుగుతాయి. మనం నివాసం ఉంటున్న ఇంట్లో ఎలాంటి చెట్లుండాలి.. ఏ చెట్టుంటే శుభం ఫలితం కలుగుతుంది.. ఉండకూడని చెట్లేవైనా ఉన్నాయా.. అనే ప్రశ్నలకు బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మఖండం ఉత్తరార్థం 103 అధ్యాయంలో కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు స్వయంగా విశ్వకర్మకు ఈ చెట్ల విశేషాలను వివరించాడు.

ఇళ్ళ ఆవరణల్లో శుభకరమైన చెట్లు, పూలతీగలు, ఫలాలనిచ్చే వృక్షాలు ఉండాలని విశ్వకర్మను కృష్ణుడు హెచ్చరించాడు. అప్పుడు విశ్వకర్మ నగర నిర్మాణం జరిగాక గృహాల ఆవరణల్లో ఏ మంచి చెట్లను ఉంచాలో, నగరం లోపల ఉద్యానవనాలలో ఎలాంటి పూలతోటలను, చెట్లను పెంచాలో వివరించమని కోరాడు. ఆ సందర్భంగా కృష్ణుడు శుభప్రదమైన మొక్కలు పూల తీగల, చెట్ల విశేషాలను చెప్పాడు. గృహస్థులు ఉండే గృహాల ఆవరణలో కొబ్బరి చెట్టు ధన ప్రదం.

Trees

తాటిచెట్టు ఎక్కడైనా ఉండొచ్చు. మామిడి ఏ దిక్కున ఉన్నా శుభప్రదమే. మారేడు, పనస, రేగు, నిమ్మచెట్లు తూర్పు దిక్కులో ఉంటే సంతానప్రదం. ఇవి దక్షిణంలోనూ, ఇతర దిక్కులలోనూ ఉన్నప్పుడు ధనప్రద ఫలితాన్నిస్తాయి. ఈ చెట్లన్నీ గృహస్థుడికి ఎంతో వృద్ధిని చేకూరుస్తాయి. అల్లనేరేడు, దానిమ్మ, అరటి తూర్పు దిక్కులో ఉంటే ఇంట్లో ఉండే వారికి బంధువులతో సఖ్యత కుదురుతుంది. ఇవే దక్షిణం దిక్కులో ఉంటే మిత్రప్రాప్తి కలుగుతుంది. సంపంగి చెట్టు ఇంటి ఆవరణలో ఏ దిక్కునైనా ఉండొచ్చు.

సొర, మంచి గుమ్మడి, మోదుగ, దోస ఇంటి ఆవరణలో ఉంటే మంగళప్రదాలు. మారేడు, వంగ శుభప్రదాలు. పండ్లనిచ్చే తీగ‌ల రకాల మొక్కలు ఎక్కడైనా ఉండొచ్చు. చెరకు ఎక్కడున్నా పర్వాలేదు. అలాగే అశోక, శిరీషం, కదంబ వృక్షాలు శుభప్రదం. పసుపు, అల్లం మొక్కలు శుభకరాలు. గ్రామంలోనూ, నగరంలోనూ కరక్కాయ చెట్టు ఉండడం శుభప్రదం. ఉసిరి చెట్టు కూడా ఇలాంటి ఫలితాన్నే ఇస్తుంది. ఉదయాన్నే లేచి తులసి చెట్టు చూసిన వ్యక్తికి బంగారం దానం చేసిన ఫలితం లభిస్తుంది.

మాలతి, మొల్ల, కుందం, మాధవి, మొగిలి, నాగకేసరం, మల్లె, పొగడ, విష్ణుక్రాంతం అనే చెట్లు ఇంటి ఆవరణలో ఉండటం మంచిది. వీటితో ఉద్యానవనాలను కూడా పెంచవచ్చు. అలాగే బూరుగ, చింత, వేప, వావిరి చెట్లను ఇంట్లో పెంచకూడదు. ఇవి అశుభకరాలు. ఉమ్మెత్త, రావి, ఆముదం లాంటి చెట్లు కూడా ఇంట్లో ఉండటం మేలు కాదు. భూమిలోకి ఎక్కువ దూరం వేళ్ళు పాతుకొనిపోయే చెట్లను ఇంట్లో పెంచకూడదు. ఇంట్లో మర్రి చెట్టు ఉంటే దొంగల భయం కలుగుతుంది. చింతచెట్టు ఇంట్లో ఉంటే ధనహాని. ఇలాంటి చెట్లు ఇళ్ళలో కాక వీధుల్లోనూ, వనాల్లోనూ ఉండవచ్చు. బూరుగ చెట్టు ఇంట్లోకాని నగరంలో కానీ ఉంటే దుఃఖప్రదం. కనుక అది లేకుండా జాగ్రత్త వహించాలి అని శ్రీకృష్ణుడు విశ్వకర్మకు వివరించి చెప్పాడు.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM