Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత.. అక్కినేని నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత వరుస సినిమాలు ఒప్పుకుంటూనే షికార్లు చేస్తోంది. అయితే విడాకుల తర్వాత సమంత ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి తీర్థయాత్రలకు వెళ్తుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. నార్త్ ఇండియాలోని ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తోంది సమంత.
ఇలా తీర్థయాత్రలకు వెళ్లడం వెనక అంతారార్థమేంటో అంటూ.. అంతా ఆరా తీస్తున్నారు. దీనికి పెద్దగా కారణాలేవి లేవు కానీ, ప్రాణంగా ప్రేమించిన నాగ చైతన్య దూరం కావడంతో చాలా డిస్టర్బ్ అయిన సామ్.. మానసిక ప్రశాంతత కోసమే ఇలా తీర్థ యాత్రలకు వెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. పాత జ్ఞాపకాల నుండి బయటకు వచ్చాక మళ్లీ తన సినిమా షూటింగ్స్‌తో బిజీ కానుందని అంటున్నారు.
ప్రస్తుతం సమంత తెలుగులో గుణశేఖర్ శాకుంతలంతోపాటు సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించబోయే సినిమాకు సైన్ చేసింది. అలాగే తమిళంలో విఘ్నేష్ శివన్ సినిమాతోపాటు డ్రీమ్ వారియర్స్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు బాలీవుడ్ ప్రాజెక్టులకు కూడా ఈ అమ్మడు పని చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…