Brahma Muhurta : సృష్టి, స్థితి, లయ కారకులనే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు.. అంటారన్న విషయం విదితమే. అయితే విష్ణువు, శివుడికి ఆలయాలు ఉన్నాయి, కానీ బ్రహ్మకు ఆలయాలు లేవు. ఆ కథ వేరే ఉంది. కానీ రోజులో ఒక ప్రత్యేకమైన సమయాన్ని మాత్రం సృష్టికర్త అయిన బ్రహ్మకు కేటాయించారు. అందుకనే ఆ సమయాన్ని బ్రహ్మ ముహుర్తం అంటారు.
సాధారణంగా ప్రతి రోజూ రాత్రి చివరి ఘడియల సమయాన్ని బ్రహ్మ ముహుర్తంగా పిలుస్తారు. అంటే.. సూర్యోదయానికి ముందు సమయం అన్నమాట. సూర్యోదయానికి ముందు సరిగ్గా ఒకటిన్నర గంటల సమయాన్ని బ్రహ్మ ముహుర్తం అంటారు. అంటే.. సూర్యోదయం ఉదయం 6 గంటలకు అయితే అంతకన్నా ముందు 4.30 గంటల నుంచి ఉన్న సమయాన్ని బ్రహ్మ ముహుర్తం అంటారన్నమాట. ఈ సమయంలో విద్యలను నేర్చుకుంటే రాణించవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
బ్రహ్మ ముహుర్తంలో శరీరం, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో విద్య, సంగీతం, ఏవైనా కళలు.. వంటివి సాధన చేస్తే చక్కగా నేర్చుకోవచ్చు. వాటిల్లో రాణిస్తారు. అందుకనే తెల్లవారుజామునే లేచి చదువుకోవాలని పెద్దలు చెబుతుంటారు.
ఇక బ్రహ్మ ముహుర్తం పూజలకు కూడా అనుకూలమే. ఎవరైనా సరే ఆ సమయంలో నిద్రలేచి.. కాలకృత్యాలు తీర్చుకుని.. శుచిగా స్నానం చేసి తమ ఇష్టదైవానికి పూజలు చేస్తే.. కోరిన కోర్కెలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. కనుక బ్రహ్మ ముహుర్తంలో విద్యలను అభ్యసించవచ్చు. లేదా పూజలు చేయవచ్చు. ఇక ఆరోగ్యం కావాలనుకునేవారు ఆ సమయంలో వ్యాయామం, యోగా, ధ్యానం చేస్తే మంచిది. వ్యాధుల నుంచి బయట పడతారు. ఇలాంటి బ్రహ్మ ముహుర్తాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ ముహుర్తం పైన తెలిపినవి చేయడానికి మంచిదని చెబుతుంటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…