Vishal : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం ఎవరూ ఊహించనిది. చిన్న వయస్సులో ఆయన హఠాన్మరణం చెందడం అందరినీ కలవర పరచింది. 46 ఏళ్ల వయస్సులో పునీత్ కన్నుమూయడంపై ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. తాజాగా పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభ ఏర్పాటు చేయగా, ఆ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు శరత్ కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు.
ఇక విశాల్ మాట్లాడుతూ.. ‘పునీత్‌ను తలచుకుంటే చిరునవ్వుతో కూడిన అతని ముఖం నా కళ్ల ముందే మెదులుతోంది. ఆయన మరణ వార్తను జీర్ణించుకోవడానికి నాకు రెండు రోజుల సమయం పట్టింది. పునీత్‌తో నాకు అంత అనుబంధం లేదు. కానీ, ఆయనకు నేనూ ఒక అభిమానినే. పునీత్.. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేవాడని మరణించే వరకూ ఎవ్వరికీ తెలీదు. అలాంటి గొప్ప వ్యక్తి.. చేసిన సేవా కార్యక్రమాల్లో నేనూ భాగం కావాలనుకుంటున్నాను.
ఇక నుండి పునీత్ చదివిస్తున్న 1800 మంది పిల్లలను ఇకపై నేను చదివిస్తాను. వాళ్ల చదువులకు అయ్యే ఖర్చు నేను భరిస్తాను. నిజం చెప్పాలంటే.. నాకు ఇప్పటివరకూ సొంత ఇల్లు లేదు. మా తల్లిదండ్రుల ఇంటిలోనే ఉంటున్నాను. ఇప్పటి వరకూ ఇంటి కోసం డబ్బు కూడబెట్టుకున్నాను. ఆ డబ్బునే ఇప్పుడు పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తాను. పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని విశాల్ అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…