Viral Video : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ.. పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. హిందీ మార్కెట్‌లో కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ఇక త్వరలోనే పుష్ప 2 మూవీని తెరకెక్కించనున్నారు. ఇందులో పుష్పకు, ఎస్‌పీ భన్వర్‌సింగ్ షెకావత్‌కు మధ్య పోరు ఉంటుందని తెలుస్తోంది. అలాగే మొదటి పార్ట్‌లోని కొందరు ఇతర విలన్లు కూడా పుష్పపై పోరాటం చేస్తారని సమాచారం.
కాగా పుష్ప సినిమాలోని పాటలు ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇందులోని రష్మిక మందన్న సాంగ్.. సామి.. సామి.. ఇప్పటికీ ప్రేక్షకుల నోళ్లలో నానుతోంది. దీనికి ఎంతో మంది సెలబ్రిటీలు డ్యాన్స్‌లు చేసి అలరించారు. సామాన్యులు కూడా ఈ పాటకు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే చాలా మంది ఈ పాటకు డ్యాన్స్‌లు చేస్తూ ఆ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక లేటెస్ట్‌గా ఓ యువతి కూడా సామి సామి సాంగ్‌కు డ్యాన్స్ చేసింది.

ఓ యువతి రష్మిక మందన్న లాగే పుష్ప సినిమాలోని సామి సామి సాంగ్‌కు డ్యాన్స్ చేయడం విశేషం. రష్మిక చేసిన విధంగానే ఆమె కూడా డ్యాన్స్ స్టెప్పులేసింది. ఈ క్రమంలోనే ఆమె వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమె డ్యాన్స్‌ను ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఇక పుష్పలోని శ్రీవల్లి పాటతోపాటు పుష్ప పాత్ర చెప్పే.. తగ్గేదేలే.. డైలాగ్‌ను కూడా ఎంతో మంది ఉపయోగిస్తున్నారు. పుష్ప సినిమా రిలీజ్ అయి దాదాపుగా 6 నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఆ మూవీకి ఇంకా క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి.
View this post on Instagram