Viral Video : అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీలో హీరో హీరోయిన్లకు చెందిన పాటలు, స్టెప్స్, డైలాగ్స్ అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పుష్పలోని తగ్గేదేలే.. డైలాగ్‌ను చాలా మంది చెబుతున్నారు. అలాగే శ్రీవల్లి పాటకు స్టెప్పులేస్తున్నారు. ఇక రష్మిక మందన్న నటించిన సామి సాంగ్‌కు డ్యాన్స్‌లు చేస్తూ అలరిస్తున్నారు. తాజాగా ఇద్దరు అమ్మాయిలు ఇదే పాటకు చేసిన డ్యాన్స్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అమెరికాకు చెందిన రాధా ప్రియాంక, రాగా అనే ఇద్దరు అమ్మాయిలు పుష్ప సినిమాలోని సామి సాంగ్ కు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. సామి పాటలో రష్మిక మందన్న చేసిన హుక్ స్టెప్‌ను వారు పర్‌ఫెక్ట్‌గా అనుకరించారు. సంప్రదాయ దుస్తులను ధరించి వారు ఈ పాటకు డ్యాన్స్ చేశారు. పాటకు తగినట్లు స్టెప్పులు వేసి అలరించారు. ఈ క్రమంలోనే రాధ ఈ పాటను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా.. ఈ వీడియో వైరల్ అవుతోంది. అందరూ వీరి డ్యాన్స్‌ను చూసి ముగ్ధులవుతున్నారు. చాలా అద్భుతంగా చేశారంటూ.. మెచ్చుకుంటున్నారు.
View this post on Instagram
కాగా పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు కూడా ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు డ్యాన్స్ చేసి తమ ముచ్చట తీర్చుకున్నారు. అలాగే తగ్గేదేలే.. అనే డైలాగ్‌ను ఇప్పటికీ అనేక మంది చెబుతూ ఎంజాయ్ చేస్తున్నారు.