Vikram Movie : కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వచ్చిన విక్రమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ కమల్ హాసన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే తెలుగు, తమిళంలలో ఈ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేస్తోంది. ఇప్పటికీ ఈ మూవీ ఇంకా 60 శాతం మేర థియేటర్లలో ప్రదర్శితం అవుతూనే ఉంది. ఈ మూవీ రిలీజ్ అయిన తొలి రోజే రూ.30 కోట్ల మేర కలెక్షన్లను రాబట్టడం విశేషం. అలాగే రోజు రోజుకీ ఈ మూవీ వసూలు చేస్తున్న కలెక్షన్స్ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.
ఇక విక్రమ్ మూవీ తమిళనాడులో బాహుబలి 2 కలెక్షన్స్‌ను బీట్ చేసింది. అక్కడ ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన మూవీగా విక్రమ్ నిలిచింది. తమిళనాడులో విక్రమ్ మూవీ రూ.150 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. ఇక ఈ మూవీ 16 రోజుల్లో మొత్తం రూ.300 కోట్లను వసూలు చేసింది. ఈ మూవీ చాలా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు అంటుండగా.. కొందరైతే ఏకంగా కేజీఎఫ్ 2ను మించిపోయిందని అంటున్నారు. అయితే వాస్తవానికి కేజీఎఫ్ 2, విక్రమ్ రెండూ వేర్వేరు కథలకు చెందిన సినిమాలు. కనుక రెండింటినీ పోల్చలేమని ఇంకొందరు అంటున్నారు.
ఇక విక్రమ్ సినిమాలోని యాక్షన్ సీన్లు ప్రధానంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాసిల్‌ల పాత్రలు కూడా ఈ మూవీకి ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. అలాగే క్లైమాక్స్‌లో నటుడు సూర్య ఎంట్రీ సీన్ ఉంటుంది. ఇది కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కనుకనే ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ప్రస్తుతం విక్రమ్ చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మునిగి తేలుతోంది. కమల్ హాసన్ చిత్ర యూనిట్ సభ్యులకు ఇప్పటికే పలు రకాల గిఫ్ట్‌లను అందించారు. కాగా విక్రమ్ సినిమాను లోకేష్ కనగరాజ్ తెరకెక్కించగా.. ఆయనే కథను అందించారు. అలాగే రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ఈ మూవీని నిర్మించింది. ఇందులో ఉన్న యాక్షన్ సీన్ల కారణంగానే ఈ మూవీ హిట్ అయిందని ప్రేక్షకులు అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…