Cobra Movie First Review : కోబ్రా సినిమా.. విలక్షణ నటుడు విక్రమ్ నుండి రాబోతున్న 58వ చిత్రం. చియాన్ విక్రమ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా 2019లో చేస్తున్నట్లు ప్రకటించిన ఈ సినిమా 3 సంవత్సరాల తరువాత ఆగస్టు 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక ఈ మూవీలో విక్రమ్ హీరోగా నటించగా, కెజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా చేసింది. ఇంకా ఇందులో మాజీ క్రికెట్ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ముఖ్య పాత్ర పోషించగా, డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన కెఎస్ రవి కుమార్ అలాగే రోషన్ మాథ్యూలు ఇతర కీలక రోల్స్ లో నటించారు. ఇక దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తుకి ఇది 3వ సినిమా కాగా ఇదివరకు ఇతను డిమాంటి కాలనీ అలాగే నయనతారతో అంజలి సిబిఐ అనే సినిమాలు చేశాడు.
ఇక విడుదలకు ఒకరోజు ముందే ఈ సినిమాకి కొందరు సినీ విశ్లేషకుల నుండి మొదటి రివ్యూ వచ్చేసింది. వారు ఈ చిత్రం గురించి రాస్తూ.. ఈ సినిమా ఒక కొత్త భిన్నమైన కాన్సెప్ట్ తో, అద్భుతమైన దర్శకత్వ ప్రతిభతో ఇంకా గొప్ప నిర్మాణ విలువలతో ఉందని పొగిడారు. అలాగే విక్రమ్ తన నట విశ్వరూపంతో అందరినీ తనవైపు తిప్పుకునేలా ఉందని కొనియాడారు. ఎన్నో మలుపులు, ట్విస్టులు ఉన్న ఈ చిత్రంలో ఇర్ఫాన్ పఠాన్ నటన కూడా ఆకట్టుకుంటుందని అన్నారు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే అస్లాన్ యిల్మజ్ అనే ఒక టర్కిష్ ఇంటర్ పోల్ ఆఫీసర్ కోబ్రా అనే పేరుతో ప్రపంచంలోని పవర్ లో ఉన్న బడా వ్యక్తులను ఎంతో చాకచక్యంగా చంపే కాంట్రాక్ట్ కిల్లర్ ను పట్టు కోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే కోబ్రా రకరకాల వేషాలు మారుస్తూ ఇంటర్ పోల్ కి దొరకకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. వీటన్నింటి వలన జరిగే సంఘటనలే ఈ సినిమా కథగా తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…