Vijay Devarakonda : గత కొన్నేళ్ల కిందట దర్శకుడు పూరీ జగన్నాథ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి జనగనమణ అనే చిత్రాన్ని తీయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ మూవీని పూరీ మహేష్‌తో తీయలేకపోయారు. తరువాత వెంకటేష్‌తో ఆ సినిమాను తీద్దామని పూరీ ప్లాన్ చేశారు. కానీ అది కూడా సక్సెస్ కాలేదు.
ఇక చివరకు పూరీ ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. ఇతర చిత్రాలతో బిజీ అయ్యారు. అయితే విజయ్ దేవరకొండతో ఆ మూవీని పూరీ జగన్నాథ్ తీస్తారని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో జనగనమణ యూఎస్ఏలో ప్రారంభం అవుతుందని సమాచారం.
లైగర్ మూవీతో పూరీ, విజయ్ ల మధ్య బాండింగ్ ఏర్పడింది. లైగర్ షూటింగ్ పూర్తి అయి విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో విజయ్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే పూరీతో కలిసి జనగనమణ చిత్రాన్ని చేయనున్నట్లు విజయ్ త్వరలోనే ప్రకటిస్తాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతి త్వరలో దీనికి సంబంధించి అధికారిక వివరాలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ఇక లైగర్ మూవీని వచ్చే ఆగస్టులో విడుదల చేయనున్నారు. అనన్య పాండే ఈ మూవీలో విజయ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. అంతర్జాతీయ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ మూవీలో నటించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…