Vijay Devarakonda : టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సమంత ప్రస్తుతం పలు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న సినిమాలో ఈ ఏడాదిలో వరుసగా విడుదల కానున్నాయి. అయితే అంత బిజీగా ఉంటూ కూడా సమంత వెకేషన్లలో తెగ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె థాయ్‌లాండ్ లో విహరిస్తోంది. అక్కడి ఓ రెస్టారెంట్‌లో గ్లామరస్‌గా దిగిన ఫొటోలను ఆమె షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే సమంతకు చెందిన ఓ ఫొటోను విజయ్ దేవరకొండ మార్ఫింగ్ చేసి ట్వీట్ చేశాడు. దీంతో ఆ ఫొటో కూడా వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
విజయ్ దేవరకొండ, సమంత.. హీరో హీరోయిన్లుగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాను ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసిన విషయం విదితమే. అయితే ఈ పూజ కార్యక్రమానికి హీరోయిన్ సమంత హాజరు కాలేదు. ఆమె వెకేషన్‌లో ఉన్నందున కార్యక్రమానికి హాజరు కాలేకపోయింది. దీంతో లోకులు పలు కాకులు అన్నట్లు మీడియా మొత్తం కోడై కూసింది. అసలు ఆమె పూజకు ఎందుకు వెళ్లలేదు.. హీరోయిన్‌గా అంత పొగరు పెరిగిపోయిందా.. పూజ కార్యక్రమానికి కూడా హాజరు కానంత బిజీ అయిందా.. అంటూ ఆమెను ట్రోల్ చేశారు. అయితే అన్నింటికీ చెక్ పెట్టేలా విజయ్ ఓ ఫొటోను షేర్ చేశాడు.
పూజ కార్యక్రమానికి చెందిన ఫొటోలో సమంతను చేర్చి విజయ్ ఆ ఫొటోను మార్ఫింగ్ చేశాడు. అనంతరం దాన్ని ట్వీట్ చేశాడు. దానికి సమంత కూడా రియాక్ట్ అయింది. ఆమె పడి పడి నవ్వినట్లు ఉన్న ఎమోజీలను షేర్ చేసింది. అంతేకాదు ఈ మూవీలో నటిస్తున్న వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. దీంతో వారి ఫొటోలను కూడా విజయ్ ఇందులో మార్ఫింగ్ చేశాడు. దీంతో ఈ ఫొటో వైరల్‌గా మారింది. మీడియాకు భలే చురకలు అంటించారు.. అని విజయ్ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…