ప్రస్తుతం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ఈ చిత్రం ట్యాగ్ లైన్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లైగర్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ట్రైలర్ తో అందరి అంచనాలను ఆకాశానికి ఎత్తేశాడు డైరెక్టర్ పూరీ. విజయ్ మేకోవర్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను పిచ్చెక్కిస్తున్నాయి.
ఇందులో విజయ్ తల్లిగా సీనియర్ నటి రమ్యకృష్ణ కనిపించనుంది. ట్రైలర్ లో రమ్యకృష్ణ ఒక లయన్ కి, టైగర్ కి పుట్టిండాడు.. క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ.. అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్ ని రౌడీ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న లైగర్ మూవీలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. అలాగే ఇందులో లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.
అయితే లైగర్ షూటింగ్ లో భాగంగా మాజీ బాక్సర్ మైక్ టైసన్‌తో కలిసి పని చేయడం పట్ల తన తల్లి విపరీతంగా భయపడిందని విజయ్ దేవరకొండ వెల్లడించాడు. ఆమె చాలా పూజలు చేసింది. నేను అమెరికా వెళ్ళే ముందు నాకు విభూతి, కుంకుమ పెట్టింది. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. ఆమె పూజలు పని చేశాయి.. అని విజయ్ అన్నాడు. ఆగస్ట్ 25న లైగర్ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీపై దృష్టి పెట్టింది చిత్ర బృందం. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…