Vijay Devarakonda : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం విదితమే. వీరు తరచూ పార్టీలకు కలసి వెళ్తుంటారు. గతంలో వీరు కలసి నటించిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అయితే వీరు తరచూ పలు చోట్ల కలసి కనిపిస్తుండడంతో వీరి మధ్య ఏదో ఉందని.. వీరు ప్రేమలో ఉన్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ మధ్య ఆ వార్తలు ఎక్కువయ్యాయి. అయితే వాటిపై ఎట్టకేలకు విజయ్ దేవరకొండ స్పందించారు.
రష్మిక మందన్న, తాను బెస్ట్ ఫ్రెండ్స్ అని, అందరూ అనుకున్నట్లు తమ మధ్య ఏమీ లేదని, తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అబద్దమని, వాటిల్లో ఎంత మాత్రం నిజం లేదని.. అసలు ఇలాంటి వార్తలను ఎలా సృష్టిస్తారు ? అంటూ విజయ్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
కాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ఇందులో విజయ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఈ మూవీ ఆగస్టు 25న విడుదల కానుంది. అలాగే రష్మిక ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో ఈమె తాజాగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం త్వరలో విడుదల కానుంది. అలాగే పుష్ప 2 షూటింగ్‌లో ఈమె త్వరలో పాల్గొననుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…