Venu Swamy : గత కొద్ది రోజులుగా మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ, ఆమె భర్త కల్యాణ్ దేవ్‌లు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్న విషయం విదితమే. వీరు గతంలో ఎప్పుడూ కలిసే ఫొటోల్లో కనిపించేవారు. కానీ ఇప్పుడు ఎవరికి వారు విడిగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అలాగే సమంత చేసినట్లుగానే శ్రీజ కూడా తన భర్త పేరును తొలగించి తన ఇంటి పేరు కొణిదెలను చేర్చుకుంది. దీంతో అనుమానాలు బలపడ్డాయి. మరోవైపు కల్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీలో జరిగే ఏ వేడుకలోనూ కనిపించకపోవడం, ఆయన సినిమాలను కూడా మెగా ఫ్యామిలీ ప్రమోట్ చేయకపోవడంతో.. శ్రీజ, కల్యాణ్ దేవ్‌లు నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు మరింత బలపడ్డాయి. అయితే ప్రస్తుతం వీరు విడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
ఇక శ్రీజతోపాటు పవన్ కల్యాణ్‌పై కూడా ఈ మధ్య కాలంలో ఆయన పెళ్లిళ్ల గురించి అనేక వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి నరేష్, పవిత్ర లోకేష్‌లపై కామెంట్స్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి. నరేష్‌కు, రమ్యకు జాతకాలు కలవలేదని.. కనుక వారు వివాహం చేసుకున్నా విడిపోతారని తాను ముందుగానే చెప్పానని.. అప్పట్లో నరేష్ పెళ్లిని కూడా తాను అందుకనే చేయలేదని చెప్పారు. తాను చెప్పినట్లే నరేష్ విడాకులు తీసుకున్నారని అన్నారు.
ఇక పవన్ కల్యాణ్, శ్రీజల గురించి వేణు స్వామి మాట్లాడుతూ.. పవన్, శ్రీజ ఇద్దరికీ నాలుగేసి చొప్పున పెళ్లిళ్లు అవుతాయి. అప్పటి వరకు వారి వివాహాలు నిలడవు. అది వారి జాతకాల్లోనే ఉంది.. అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే వారు ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటారు.. అన్నది వారి వ్యక్తిగత విషయం అని.. దానిపై మనం మాట్లాడుకోవడం సరికాదని అన్నారు. ఈ క్రమంలోనే వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.
కాగా పవన్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు ఇచ్చి ఇప్పుడు మూడో భార్యతో ఉంటున్నారు. అంటే ఆయన ఇంకో వివాహం కూడా చేసుకుంటారని వేణు స్వామి వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక శ్రీజ విషయానికి వస్తే ఆమె ఇప్పుడు రెండో పెళ్లితో ఉంది. అంటే ఆమె ఇంకా 2 పెళ్లిళ్లు చేసుకుంటుందని అర్థం వస్తుంది. మరి వేణు స్వామి వీరి విషయాల్లో చెప్పిన జాతకాలు నిజం అవుతాయో.. కావో.. చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…