Venkatesh : విక్టరీ వెంకటేష్.. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన అగ్ర హీరోల్లో ఒకరు. ప్రస్తుతం భిన్న రకాల సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. మల్టీ స్టారర్ మూవీలకు వెంకటేష్ ప్రస్తుతం పెద్ద పీట వేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఈయన నటించిన ఎఫ్3 మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌ను కూడా వేగవంతం చేశారు. ఇక ఈయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను వెల్లడించారు.
తెలుగు బుల్లితెరపై ఇప్పటికే అనేక మంది స్టార్ హీరోలు యాంకర్లుగా వ్యవహరించి మెప్పించారు. బిగ్‌బాస్ ద్వారా ఎన్‌టీఆర్, నాగార్జున, నాని ఆకట్టుకోగా.. ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడుతోనూ మెప్పించారు. చిరంజీవి కూడా ఇదే షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. అలాగే రానా దగ్గుబాటి నంబర్ వన్ యారి చేశారు. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోతో ఎంట్రీ ఇచ్చారు. ఇలా స్టార్ హీరోలు ఇప్పటికే బుల్లితెరపై సందడి చేయగా.. వెంకటేష్ మాత్రం రియాలిటీ షోలను చేయడం లేదు. అయితే దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి ? అని ఆయనను అడగ్గా.. అందుకు ఆయన ఆశ్చర్యకరంగా సమాధానం ఇచ్చారు.
రియాలిటీ షోలు అంటే.. కొన్ని సార్లు చెప్పిన డైలాగ్‌లనే మళ్లీ చెప్పాలి. అదే యాక్ట్‌ను మళ్లీ రిపీట్ చేయాలి. అలా ఒకటి రెండు సార్లు అయితే చేయగలం. కానీ పదే పదే అలా చేయడం నా వల్ల కాదు.. నేను అలా చేస్తుంటే ఒకదశలో బ్లాంక్ అయిపోతాను.. ఇంక నాతో కాదు.. అందుకనే రియాలిటీ షోలను చేయడం లేదు.. అని వెంకటేష్ సమాధానం ఇచ్చారు.
ఇక వెంకటేష్‌ను తన కుమారుడు ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడని ప్రశ్నించగా.. ఇప్పటి వరకు అయితే తమకు ఆ ఉద్దేశం లేదని.. వారు ఏం అవదలచుకున్నారో వారి ఇష్టమని అన్నారు. ప్రస్తుతానికి విద్యాభ్యాసం కొనసాగుతుందని.. అది పూర్తయ్యాక తన కెరీర్‌పై తానే నిర్ణయం తీసుకుంటాడని.. వెంకటేష్ అన్నారు. కాగా వెంకటేష్ నటించిన ఎఫ్3 మూవీ ఈ నెల 27 న రిలీజ్ కానుండగా.. ఇందులో ఆయనకు జోడీగా తమన్నా యాక్ట్ చేసింది. వరుణ్ తేజ్, మెహ్రీన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్‌లు కూడా ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…