Upasana : మెగా కోడలుగా పేరుగాంచిన ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమెకు అటు పుట్టింటి నుంచి, ఇటు మెట్టింటి నుంచి ఎంతో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అపోలో హాస్పిటల్స్ నిర్వహణను చూసుకోవడమే కాదు.. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఈమె చురుగ్గా పాల్గొంటున్నారు. మూగజీవాల పట్ల జాలి, దయ చూపిస్తుంటారు. జూ పార్క్‌లో ఇప్పటికే పలు జీవాలను దత్తత చేసుకుని వాటి పోషణ బాధ్యతలను చూస్తున్నారు. అలాగే 200కు పైగా అనాథ, వృద్ధాశ్రమాలకు ఆమె సహాయం చేస్తున్నారు. ఇలా ఉపాసన అత్తిల్లు, పుట్టిల్లు వారి పేరును నిలబెడుతున్నారు.
అయితే రామ్ చరణ్, ఉపాసన తాజాగా తమ 10వ పెళ్లి రోజును పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు వెకేషన్‌కు వెళ్లారు. అయితే ఓ ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. తాను చిన్నప్పటి నుంచి ఎంతో స్వేచ్ఛగా పెరిగానని.. తనకు ఇంట్లో ఎంతో స్వేచ్ఛ ఉండేదని అన్నారు. ఈ సమాజంలో నమ్మకంగా ఎలా జీవించాలో తన తల్లిదండ్రులు తనకు నేర్పించారని.. అందువల్లే తన కాళ్లపై తాను నిలబడి జీవించగలుగుతున్నానని అన్నారు.
ఇక తన జీవితంపై తన తండ్రి ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఉపాసన తెలిపారు. అయినప్పటికీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆయన నుంచే నేర్చుకున్నానని వెల్లడించారు. ఇతరులను ప్రేమించడం, ఆప్యాయత చూపించడం వంటి అనేక విషయాలను తన తండ్రి ద్వారానే నేర్చుకున్నానని అన్నారు. అయితే తాను చరణ్‌ను పెళ్లి చేసుకున్నాక పరిస్థితులు మారిపోయాయని.. ఆరంభంలో చరణ్‌తో ఇబ్బందులు పడ్డానని.. కానీ ఆయనను పెళ్లి చేసుకోవడం తన అదృష్టం అని తెలిపారు. అలాగే అన్ని విషయాల్లోనూ అడ్జస్ట్ అయి జీవిస్తున్నానని ఉపాసన తెలిపారు. కాగా ఉపాసన చేసిన ఈ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…