Upasana : మెగా కోడలు ఉపాసన కొణిదెల ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె ఓ వైపు రామ్ చరణ్‌తో కలిసి ఆయన సినిమాకు చెందిన కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను నెరవేరుస్తున్నారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ అందరిచే మన్ననలు పొందతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె చేస్తున్న ఓ గొప్ప పని గురించిన సమాచారం బయటకు వచ్చింది.
ప్రస్తుతం చాలా మంది సెలబ్రిటీలు డబ్బు సంపాదిస్తున్నా అత్యంత దాతృత్వ గుణం ఉన్నది కొందరికే. అలాంటి వారిలో చిరంజీవి ఒకరని చెప్పవచ్చు. ఇప్పటికీ ఆయన ఇంటి నుంచి లక్షల రూపాయలు సహాయం రీత్యా బయటకు వెళ్తుంటాయి. ఎంతో మందికి కాదు, లేదు అనకుండా చిరంజీవి సహాయం చేస్తున్నారు. అయితే ఆయన గుణాలనే ఉపాసన పుణికి పుచ్చుకున్నారు. ఆమె కూడా ఎన్నో గొప్ప సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. అందులో భాగంగానే ఆమె తాజాగా ఓ వృద్ధాశ్రమంలో వృద్ధ మహిళలతో సరదాగా గడిపారు. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి.
వాస్తవానికి ఉపాసన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం 150కి పైగా వృద్ధాశ్రమాలకు చేయూతను ఇస్తున్నారట. అందుకనే ఆమె అప్పుడప్పుడు ఆశ్రమాలకు వెళ్లి వస్తుంటారు. అక్కడ వృద్ధులతో కలిసి గడుపుతారు. వారి కష్ట సుఖాలను తెలుసుకుంటారు. వారికి ఆమె కన్న బిడ్డలా మారి సహాయం చేస్తున్నారు. అందుకనే ఉపాసనను అందరూ ప్రశంసిస్తుంటారు. ఇక ఉపాసన ఈ మధ్య చరణ్ సినిమాలను థియేటర్లలో చూసి హంగామా చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీ చూస్తూ చరణ్ ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు ఆమె ఈలలు, చప్పట్లతో సందడి చేశారు. గాల్లోకి పేపర్లను విసిరారు. అలాగే ఆచార్య మూవీని చూసి చాలా బాగుందని చెప్పారు. దీంతో ఆమె పోస్టులు వైరల్ అయ్యాయి. ఇక తాజాగా ఆమె చేస్తున్న సేవను చూసి ఆమెది ఎంత గొప్ప మనసో అని అందరూ అభినందిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…