అతను ఎంతో చదువుకున్నాడు.. ఫోరెన్సిక్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేస్తున్నాడు.. కానీ అతని మతిస్థిమితం సరిగ్గా లేదు. దీంతో అతను కరోనా వస్తుందేమోనన్న భయంతో కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను అతి దారుణంగా చంపేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కాన్‌పూర్‌లోని కల్యాణ్‌పూర్ అనే ప్రాంతంలో నివాసం ఉండే ఓ వ్యక్తి ఫోరెన్సిక్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతను కరోనా కొత్త వేరియెంట్ వస్తుందేమోనని భయపడి భార్య గొంతుకు తీగను బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. తరువాత సుత్తితో తన ఇద్దరు పిల్లల తలలపై బలంగా మోది హత్య చేశాడు. అనంతరం తన ఇంటి నుంచి పారిపోయాడు.
అలా అతను పారిపోతూ తన సోదరుడికి వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుందని, అది ప్రపంచంలో ఎవరినీ విడిచిపెట్టదని, అందరినీ చంపుతుందని, అందుకనే దాన్నుంచి అందరికీ విముక్తి కల్పిస్తున్నానని.. అతను వాట్సాప్ మెసేజ్ చేశాడు. అది చదివిని అతని సోదరుడు వెంటనే ఆ ఇంటికి వెళ్లి జరిగిన దారుణాన్ని చూశాడు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించగా.. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. ఆ ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. కాగా ఆ ప్రొఫెసర్ గత కొంత కాలంగా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని, అందుకు అతను చికిత్స కూడా తీసుకుంటున్నాడని వెల్లడైంది. గతంలో ఒకసారి భార్యను చంపబోయాడని కూడా తెలిపారు. అయితే ఈసారి నిజంగానే తన కుటుంబం మొత్తాన్ని హత్య చేశాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…