Unstoppable With NBK : నందమూరి బాలయ్య ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఆహా కోసం అన్‌స్టాపబుల్ అనే షో చేస్తున్నారు. ఈ షోకి సంబంధించి తాజాగా ప్రోమో విడుదల కాగా, ఇందులో మోహన్ బాబుతో కలిసి తెగ సందడి చేశాడు. చివరలో లక్ష్మీ ప్రసన్న, విష్ణు పాల్గొనగా.. వారిని బాలకృష్ణ ప్రశ్నలడిగారు. ఈ షోకు సంబంధించిన చిత్రీకరణ ఎప్పుడో ముగిసింది. నవంబర్ 4న ఈ షో స్ట్రీమింగ్ కానుంది.
ఈ షో తర్వాతి గెస్ట్‌లు ఎవరని కొద్ది రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. తాజాగా ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. రెండవ హోస్ట్‌గా రానా దగ్గుబాటి వస్తారని, ఇక మూడో ఎపిసోడ్ నేచురల్ స్టార్ నానితో ఉంటుందని, ఈ ఎపిసోడ్‌కు సంబంధించి చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ఇక నాలుగో షోను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై చిత్రీకరించబోతున్నారట. ఐదవ ఎపిసోడ్‌ను నందమూరి మరో నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై చిత్రీకరిస్తారట.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ను చిత్రీకరిస్తున్నారు. తొలి ఎపిసోడ్ ప్రోమో చూస్తే మాత్రం ఆయన అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా చిత్రీకరించాడని తెలుస్తోంది. ఇక బాలకృష్ణ సినిమాల విషయానకి వస్తే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన అఖండ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదలపై ఓ క్లారిటీ వస్తుందని సమాచారం. దీని తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…