Unstoppable With NBK : నందమూరి బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ ఆహాలో స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. దీపావళి కానుకగా మొదటి ఎపిసోడ్ ను నవంబర్ 4న స్ట్రీమింగ్ చేయనున్నారు. మొన్నటి వరకు తొలి ఎపిసోడ్ గెస్ట్ ఎవరా అని అందరిలోనూ అనుమానాలు ఉండేవి. తాజాగా ప్రోమోతో పూర్తి క్లారిటీ ఇచ్చారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్టైలిష్ ఎంట్రీ ఇవ్వగా, ఇద్దరి మధ్యా ఆసక్తికర చర్చ నడిచింది.
తెలుగుదేశం పార్టీ పగ్గాలు మీరు తీసుకోకుండా చంద్రబాబుకు ఎందుకు అప్పగించారు ? అని మోహన్ బాబు అడగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు ఎప్పుడూ కూడా బాలయ్య ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అయితే ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఎవరో ఫిటింగులు పెడుతుంటారు అంటూ చెప్పడం, అరవిందే.. నన్ను ఈ ప్రశ్న అడగమని చెప్పి ఉంటారు ? అని మోహన్ బాబు అనడం చూస్తుంటే షో రసవత్తరంగా ఉంటుందని అర్ధమవుతోంది.
షో ఆరంభంలో మోహన్ బాబు రాగా, ఆ తర్వాత మంచు లక్ష్మీ, మంచు విష్ణు అడుగుపెట్టారు. మంచు లక్ష్మీ.. బాలయ్యతో డ్యాన్స్ చేయడం స్పెషల్ హైలైట్ అనే చెప్పాలి. సాధారణంగా మోహన్ బాబు టాక్ షో ల్లో ఎక్కువగా కనిపించరు. ఆ మధ్య అలీ టాక్ షో లో కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇప్పుడు బాలయ్య అన్ స్టాపబుల్ షో లో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ షో ఉంటుందనే నమ్మకాన్ని ఆహా వారు వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…