Under 19 Cricket World Cup : ఐసీసీ అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీల్లో భారత్ ప్రతిసారి తన సత్తా చాటుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతున్న అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా పేరున్న బంగ్లాదేశ్‌ను క్వార్టర్ ఫైనల్‌లో ఓడించిన భారత్ సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించింది. కాగా అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీల్లో భారత్ సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించడం వరుసగా ఇది నాలుగవ సారి కావడం విశేషం.
ఈ సారి జరుగుతున్న టోర్నీలో గ్రూప్‌లో భారత్, సౌతాఫ్రికా, ఐర్లాండ్, ఉగాండాలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే భారత్ సౌతాఫ్రికాను 45 పరుగుల తేడాతో ఓడించింది. అలాగే ఐర్లాండ్‌పై 174 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉగాండాపై ఏకంగా 326 పరుగుల రికార్డు తేడాతో భారత్ గెలుపొందింది. ఇక తాజాగా శనివారం ఆంటిగ్వాలో బంగ్లాదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ప్రస్తుతం భారత అండర్ 19 క్రికెట్ జట్టుకు ధుల్ కెప్టెన్సీ వహిస్తున్నాడు. షేక్ రషీద్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ క్రమంలోనే భారత్ ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 2వ తేదీన జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌ను ఫిబ్రవరి 5న నిర్వహిస్తారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…