చిరంజీవి కోసం ఆ ఇద్ద‌రు హీరోయిన్లు కొట్టుకున్నారా ? ఎవ‌రు ?

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న 40 ఏళ్లుగా టాలీవుడ్‌లో ఉన్నారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌నే నంబ‌ర్ వ‌న్ హీరోగా ఉన్నారు. ఈయ‌న‌కు పోటీ ఎవ‌రూ లేర‌నే చెప్ప‌వ‌చ్చు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా క‌ష్ట‌ప‌డి స్వ‌యం కృషితో స్టార్ హీరో స్థాయికి చేరుకున్నారు. పునాదిరాళ్లు అనే మూవీతో సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయ‌న అంచ‌లంచెలుగా ఎదిగారు. ఈ వ‌య‌స్సులోనూ ఈయ‌నే నంబ‌ర్ వ‌న్ హీరోగా ఉన్నారు. అయితే 10 ఏళ్ల పాటు రాజ‌కీయాల వ‌ల్ల సినిమాల‌కు దూర‌మైనా మ‌ళ్లీ ఖైదీ నంబ‌ర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. త‌న‌లో ఇంకా యాక్టింగ్ ప‌వ‌ర్ ఉంద‌ని నిరూపించారు.

ఈ వ‌య‌స్సులోనే చిరంజీవి చేసే డ్యాన్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. యంగ్ హీరోలకు దీటుగా ఆయ‌న డ్యాన్స్ స్టెప్స్ వేస్తుంటారు. ప్ర‌స్తుతం చిరు వ‌రుస సినిమాల‌తో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే చిరంజీవి త‌న కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్ల‌తో న‌టించారు. అప్ప‌ట్లో ఆయ‌న మాధ‌వి, రాధిక‌, రాధ‌, విజ‌య‌శాంతి, ర‌మ్య‌కృష్ణ‌, రంభ‌, రోజా వంటి హీరోయిన్ల‌తో న‌టించారు. త‌రువాత సాక్షి శివానంద్‌, సిమ్రాన్‌, ఇప్పుడు కాజ‌ల్‌, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా.. ఇలా మూడు త‌రాల హీరోయిన్ల‌ను క‌వ‌ర్ చేశారు. అయితే చిరంజీవి త‌న కెరీర్ లో ఎన్నడూ వివాదాల్లో చిక్కుకోలేదు. అలాగే ఏ హీరోయిన్‌తోనూ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌లేదు. చాలా హుందాగా ఉండేవారు. కానీ ఒక మూవీ షూటింగ్‌లో ఆయ‌న కోసం ఇద్ద‌రు హీరోయిన్లు కొట్టుకున్నార‌ట‌. అయితే నిజంగా కాదులెండి. అదంతా ఫ‌న్నీగానే సాగింది. ఇంత‌కీ అది ఏ సినిమా అంటే..

అప్ప‌ట్లో ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్‌తో చేసిన ఇంద్ర మూవీ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ మూవీ 2002 జూలై 24వ తేదీన రిలీజ్ అయి బాక్సాఫీస్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది. ఇందులో చిరుకు జోడీగా ఆర్తి అగ‌ర్వాల్‌, సోనాలి బింద్రెలు హీరోయిన్లుగా న‌టించారు. అయితే చివ‌ర్లో ఒక సీన్ ఉంటుంది. క్లైమాక్స్‌లో ఆర్తి అగ‌ర్వాల్‌, సోనాలిలు చిరంజీవి కోసం పోట్లాడుకుంటారు. ఆయ‌న నాకే భ‌ర్త అవుతాడంటే.. కాదు నాకే భ‌ర్త అవుతాడు.. అంటూ ఇద్దరూ పోట్లాడుకుంటారు. అయితే వాస్త‌వానికి అక్క‌డ చిన్న ఫ‌న్నీ గొడ‌వ జ‌రిగింద‌ట‌.

ఆర్తి అగ‌ర్వాల్ త‌న‌నే ఇంద్ర పెళ్లి చేసుకున్న‌ట్లు చూపించాల‌ని ద‌ర్శ‌కున్ని కోర‌గా.. సోనాలి కూడా త‌న‌కే తాళి క‌ట్టిన‌ట్లు క్లైమాక్స్‌ను ముగించాల‌ని ద‌ర్శ‌కున్ని కోరింద‌ట‌. దీంతో ఇద్ద‌రూ ఈ విషయంలో ఫ‌న్నీగా గొడ‌వ‌ప‌డ్డార‌ట‌. అయితే ఇలా కాకుండా ఇంద్ర అనే వ్య‌క్తి ప్ర‌జ‌ల మ‌నిషి అని చెబుతూ ముగింపును ఇస్తారు. ఇలా క్లైమాక్స్‌ను తెర‌కెక్కించారు. దీంతో ఇద్ద‌రు హీరోయిన్ల మ‌ధ్య గొడ‌వ ముగుస్తుంది. అయితే ఆ షూటింగ్‌లో జ‌రిగిన ఆ సంఘ‌ట‌న‌ను మెగాస్టార్ ఇప్ప‌టికీ చెబుతూ నవ్విస్తుంటారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM