Tollywood : ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుంచి కోలుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక గాడిన పడిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపిస్తుండడంతో వచ్చేనెల నుంచి పెద్ద ఎత్తున భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి. ఇలాంటి సమయంలోనే అనుకోని విధంగా పిడుగులాగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండడంత ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడుతున్నాయి.
ఇప్పటికే ఈ వేరియంట్ గురించి అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయాలలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ వైరస్ కనుక ఇండియాలో వ్యాప్తి చెందితే ఈ ప్రభావం తప్పనిసరిగా మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీపై పడుతుందని తెలుస్తోంది. కరోనా రెండవ దశలో భాగంగా భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇప్పుడిప్పుడే ఆ భయాందోళనల నుంచి బయట పడుతున్న సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండడం ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తోంది.
ఈ వేరియంట్ సాధారణ కరోనా వైరస్ కన్నా ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే వైద్యనిపుణులు వెల్లడించారు. దీంతో ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. ఇక ఈ వేరియంట్ కేసులు కనుక తెలుగు రాష్ట్రాలలో నమోదయితే మరోసారి టాలీవుడ్ పై కోలుకోలేని దెబ్బ పడుతుందని చెప్పవచ్చు.
ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు. ఇవన్నీ సంక్రాంతి బరిలో దిగనున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఒమిక్రాన్ అందరినీ భయాందోళనలకు గురిచేస్తోంది. మరి ఈ వేరియంట్ ప్రభావం టాలీవుడ్ పై ఏవిధంగా ఉండబోతోంది.. అనే విషయం కొద్ది రోజులలో తెలియనుంది. డిసెంబర్ 2వ తేదీన అఖండ సినిమా విడుదల కానుండడంతో.. ఈ మూవీ కలెక్షన్లపై ఒమిక్రాన్ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై కూడా త్వరలో ఏ విషయమూ తేలనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…