Tollywood : ఈమధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా భార్య భర్తల మధ్య విడాకులు చాలా కామన్ అయ్యాయి. అలాగే సెలెబ్రిటీలు కూడా తమ జీవితంలో విడాకులు అనేవి చాలా రెగ్యులర్ గా జరుగుతున్నాయి. అటు సోషల్ మీడియాకి, అభిమానులకు కూడా తమ ఫేవరెట్ సెలెబ్రిటీల విడాకులు అంటే కాస్త ఎక్కువగానే ఫోకస్ ఉంటుంది. రీసెంట్ గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంచలనం రేపిన నాగచైతన్య, సమంతల విడాకులు కూడా తారా స్థాయికి చేరాయి.
సోషల్ మీడియాలో సమంతపై జరిగిన విపరీతమైన ట్రోల్స్ కి, యూట్యూబ్ ఛానెల్స్ లో తన పర్సనల్ విషయాలను బయటకు లాగి.. ఆమె వ్యక్తిగత జీవితంపై పలు ఊహాగానాలు చేసినందుకు గాను సామ్.. ఆన్ లైన్ ఛానెల్స్ పై, పలువురిపై పరువు నష్టం కేసులను పెట్టారు. ఇదిలా ఉండగా.. లేటెస్ట్ సమాచారం ప్రకారం మరో సెలెబ్రిటీ కపుల్ విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
చాలా కాలం క్రితం వార్తల్లో నిలిచిన బిగ్గెస్ట్ ఫ్యామిలీకి చెంది అమ్మాయి.. తన భర్తతో పలు వివాదాల కారణంగా విడాకులు తీసుకుంటుందని తెలుస్తోంది. అలాగే ఆమె భర్త చిన్న చిన్న సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ జంట సమస్యల్ని ఎదుర్కుంటున్నారని, విడిపోవాలని అనుకుంటున్నారని.. తెలిపినట్లు గాసిప్స్ వస్తున్నాయి. భార్యభర్తల మధ్య ఉండాల్సిన అడ్జెస్ట్ మెంట్, త్యాగం, నమ్మకం, అర్థం చేసుకోవడం లాంటివి వీరి మధ్య లోపించాయని, అందుకే ఎంతో మంది అభిప్రాయం ప్రకారమే వారు విడాకులు తీసుకుంటున్నారని సమాచారం. మరి ఏమవుతుందో చూడాలి.