TikTok : మన దేశంలో ఒకప్పుడు టిక్‌టాక్ యాప్ సృష్టించిన హల్ చల్ అంతా ఇంతా కాదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ అందులో వీడియోలు చూడడం లేదా వీడియోలు తీసి అప్ లోడ్ చేయడం పరిపాటిగా మారింది. దీంతో చాలా మంది ఈ ప్లాట్‌ఫామ్‌పై స్టార్లుగా మారారు. టిక్ టాక్ స్టార్ అనే బిరుదును తెచ్చుకున్నారు. అయితే 2020లో కేంద్ర ప్రభుత్వం చైనా యాప్‌లను నిషేధించింది. దేశభద్రతకు ముప్పు పొంచి ఉందనే నేపథ్యంలో ఈ యాప్‌లను నిషేధిస్తున్నట్లు తెలియజేసింది. వాటిల్లో టిక్‌టాక్ కూడా ఒకటి. అయితే ఈ యాప్‌ను నిషేధించాక చాలా మంది టిక్‌టాక్ యూజర్లు ఇతర యాప్‌లను వాడడం మొదలు పెట్టారు.
టిక్‌టాక్ నిషేధం అనంతరం ఎంఎక్స్ టకాటాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, చింగారి వంటి యాప్‌లు పాపులర్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ యాప్‌లలో యూజర్లు మళ్లీ వీడియోలను అప్ లోడ్ చేయడం మొదలు పెట్టారు. అయితే టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ తాజాగా భారతీయ యూజర్లకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. త్వరలోనే మళ్లీ ఈ యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఓ పత్రికలో వచ్చిన కథనం ద్వారా తెలుస్తోంది. దీంతో టిక్ టాక్ మళ్లీ భారత్‌లోకి వస్తుందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటనను మాత్రం వెల్లడించలేదు.
గతంలో భారత్ నిషేధించిన యాప్‌లలో ప్రముఖ యాప్ టిక్ టాక్ ఉంది. దీంతోపాటు పబ్‌జి గేమ్‌ను కూడా నిషేధించారు. అయితే ఆ గేమ్ డెవలపర్ అయిన క్రాఫ్టన్ సంస్థ చైనా సంస్థ అయిన టెన్సెంట్ గేమ్స్‌తో తెగదెంపులు చేసుకుంది. భారత్‌లో సొంతంగానే పబ్‌జి ని మళ్లీ రిలీజ్ చేసింది. దానికి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాగా పేరు మార్చి లాంచ్ చేసింది. దీంతో పబ్‌జి మళ్లీ భారత్‌లోకి వచ్చింది. కానీ టిక్ టాక్ మాత్రం ఇంకా ఆ ప్రయత్నం చేయలేదు. కారణం దాని మాతృసంస్థ బైట్ బ్యాన్స్ పూర్తిగా చైనా సంస్థనే. కనుక ఆ సంస్థ మన దేశంలో మనుగడ సాగించలేదు. కానీ ఇక్కడి సంస్థలతో భాగస్వామ్యం అయి డేటాను కూడా ఇక్కడే స్టోర్ చేస్తే మళ్లీ మన మార్కెట్‌లో ప్రవేశించవచ్చు. కనుక బైట్ డ్యాన్స్ సంస్థ భారత్‌కు చెందిన హిరనందని గ్రూప్‌తో భాగస్వామ్యం అయినట్లు తెలుస్తోంది. దీంతో టిక్‌టాక్‌ను త్వరలోనే భారత్‌లో మళ్లీ రిలీజ్ చేయనున్నారని సమాచారం.
ఇక అనుకున్న ప్రకారం జరిగితే మరో ఏడాదిలోగానే టిక్‌టాక్ భారత్‌లో మళ్లీ లాంచ్ అవుతుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ త్వరలోనే దీనిపై పూర్తి వివరాలను వెల్లడిస్తారని తెలుస్తోంది. కాగా టిక్‌టాక్‌ను భారత్‌లో నిషేధించి 2 ఏళ్లు అవుతోంది. ఈ యాప్ భారత్‌లో మళ్లీ వస్తే టిక్‌టాక్ మరింత పాపులర్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఇతర యాప్స్ దెబ్బకు ఢమాల్ అనడం ఖాయం. మరి టిక్‌టాక్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…