Sri Krishna : ఎన్టీఆర్ తో స‌హా టాలీవుడ్ లో శ్రీ‌కృష్ణుడి పాత్రలో న‌టించి మెప్పించిన హీరోలు వీళ్లే..!

Sri Krishna : విష్ణుమూర్తి అవతారాల్లో మనకు అత్యంత ప్రీతి పాత్రమైన అవతారం కృష్ణ అవతారం. భగవంతుడు శ్రీకృష్ణుని గురించి ఎంత చెప్పినా త‌క్కువే అనిపిస్తుంది. ఆయన కథల గురించి ఎంత విన్నా కూడా ఇంకా వినాలనిపించే విధంగా ఉంటాయి. మన పూర్వీకులు నాటకాల రూపంలో, చిత్రపటాలలో మాత్రమే శ్రీకృష్ణుడిని చూసేవారు.  సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత శ్రీ కృష్ణ భగవానుడి గురించి ఎన్నో చిత్రాలు విడుదలయ్యాయి. కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు అని ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్లు ఉంచారు ఎందరో నటులు. ఇలా శ్రీ కృష్ణ భగవాన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

కృష్ణుడు అనగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది నందమూరి తారక రామారావు.  దాదాపు 18 పౌరాణిక చిత్రాల్లో కృష్ణుడిగా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో కృష్ణుడిగా తెలుగు ప్రజలను మెప్పించిన నటుడు కాంతారావు. తనదైన శైలిలో కృష్ణుడుగా నటించిన కాంతారావు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

Sri Krishna

ఎన్టీఆర్ కి నటనలో సమానులైన ఏఎన్నార్ పూర్తిస్థాయిలో కృష్ణుడి పాత్రలో నటించలేదు. కానీ గోవులగోపన్న చిత్రంలో ఒక పాటలో కృష్ణుని పాత్రలో కనిపించారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా బాపు దర్శకత్వంలో వచ్చిన సాక్షి చిత్రంలో ఒక సన్నివేశంలో కృష్ణుడిగా నటించారు. తెలుగు తెర‌పై శ్రీ‌కృష్ణుడిగా మెప్పించిన హీరోల్లో శోభ‌న్ బాబు కూడా ఒక‌రు. బాపు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బుద్ధిమంతుడు సినిమాలో మొద‌టిసారి శ్రీ‌కృష్ణుడి వేషంలో ద‌ర్శ‌నం ఇచ్చాడు నట భూషణ శోభ‌న్ బాబు. ఆ తరువాత క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన కురుక్షేత్రం సినిమాలో పూర్తి స్థాయిలో శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించి  తెలుగు ప్రేక్షకులను మెప్పించారు శోభన్ బాబు.

ఎన్టీఆర్ వారసుడు నందమూరి హరికృష్ణ శ్రీకృష్ణావతారం చిత్రంతో బాలకృష్ణుడి పాత్రలో నటించి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. పాండురంగ మ‌హ‌త్యం సినిమాలో విజ‌య నిర్మ‌ల చిన్ని కృష్ణుడి పాత్ర‌లో న‌టించారు. అతిలోక సుందరి శ్రీదేవి కూడా యశోద కృష్ణ చిత్రంలో బాలకృష్ణుడిగా నటించింది. ఈ య‌శోద కృష్ణ సినిమాలోనే పెద్ద శ్రీ‌కృష్ణుడి పాత్ర‌లో న‌టించారు రామ‌కృష్ణ‌. ఈయ‌న ఎక్కువ సినిమాల్లో భ‌గ‌వంతుడి పాత్ర‌ల్లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఆ తర్వాత కాలంలో శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు చిత్రాలలో బాలయ్యబాబు కృష్ణుని పాత్రలో కనిపించారు. అదేవిధంగా అక్కినేని నాగార్జున కృష్ణార్జున చిత్రంలోనూ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గోపాల గోపాల చిత్రంలోనూ కృష్ణుడిగా సామాన్యుడి పాత్రలో కనిపించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు యువరాజు చిత్రంలో కృష్ణుడిగా ఓ చిన్న సన్నివేశంలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM