Actors : 1987లో కె.మురళీ మోహనరావు దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, యాక్షన్ కింగ్ అర్జున్, నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోలుగా నటించిన చిత్రం త్రిమూర్తులు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోలకు జోడీలుగా శోభన, ఖుష్బు, అశ్వినీ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రానికి టి.సుబ్బిరామిరెడ్డి నిర్మాణ సారథ్యం వహించారు. బప్పీలహరి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించారు. 1981లో విడుదలైన హిందీ చిత్రం నసీబ్ కి రీమేక్ గా జూన్ 24,1987 లో త్రిమూర్తులు చిత్రాన్ని విడుదల చేశారు. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని అందుకుంది.
నసీబ్ సినిమాలోని ఒక పాటలో బాలీవుడ్ కు చెందిన టాప్ హీరోస్ అందరూ గెస్ట్ అప్పియరెన్స్ లో కనిపించి బాలీవుడ్ లో అలరించారు. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అలాగే టాప్ హీరోస్ ఒక పాటలో కనిపించాలని నిర్మాత సుబ్బిరామిరెడ్డి భావించి 7 మంది హీరోలను, 4 మంది హీరోయిన్స్ తో మాట్లాడి ఒప్పించారట. త్రిమూర్తులు చిత్రంలో ఒకే పాటలో ప్రముఖ స్టార్స్ అందరూ కనిపించిన ఆ పాటే.. ఒకే మాట, ఒకే బాట.. మతం లేదు.. కులం లేదు.. అనే పాట. ఈ పాటలో వెంకటేష్ తోపాటు శోభన్‌బాబు, విజయశాంతి, కృష్ణ, విజయనిర్మల, చిరంజీవి, రాధిక, కృష్ణం రాజు, రాధ, మురళీ మోహన్, శారద, బాలకృష్ణ, భానుప్రియ, నాగార్జున, సుమలత, చంద్రమోహన్, జయమాలిని లు కనిపిస్తారు.
మొదటగా ఈ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్ కోసం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లను సంప్రదించగా వారు కొన్ని కారణాల రీత్యా రాలేమని చెప్పారట. వారి స్థానాల్లో బాలకృష్ణ, నాగార్జునలు వచ్చి ఈ పాటలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. అప్పట్లో కేవలం ఈ పాటను చూడడానికే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారట.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…