Bandla Ganesh : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే బండ్ల గణేష్ ఒకప్పుడు ఎంతలా అభిమానించేవారో అందరికీ తెలిసిందే. పవన్‌ను ఆయన దేవుడిగా భావించారు. అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు బండ్ల గణేష్ ఓ కార్యక్రమంలో ఇచ్చిన స్పీచ్ హైలైట్ అయింది. ఈ మూవీ పవన్ కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీన్ని బండ్ల గణేష్ నిర్మించారు. ఈ మూవీ అప్పట్లోనే రూ.65 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. దీంతో బండ్ల గణేష్ రాత్రికి రాత్రే స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్నో సినిమాలను నిర్మించారు. తనకు గబ్బర్ సింగ్ ద్వారా పవన్ లైఫ్ ఇచ్చారు కనుకనే ఆయనను బండ్ల గణేష్ దేవుడిగా భావించేవారు.
ఇక పవన్ జనసేన పార్టీ పెట్టినప్పటికీ కొంత కాలం పాటు బండ్ల గణేష్ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆ తరువాత ఆయనకు షాక్ తగిలింది. దీంతో రాజకీయాల నుంచి ఆయన శాశ్వతంగా తప్పుకున్నారు. తరువాత పవన్‌కు, బండ్లకు మధ్య కాస్త గ్యాప్ పెరిగింది. అయినప్పటికీ దాన్ని ఎప్పుడూ బండ్ల బయట పడనివ్వలేదు. అయితే ఆయనకు చెందినదిగా చెప్పిన ఒక టేప్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తనను త్రివిక్రమ్ శ్రీనివాస్ అడ్డుకుంటున్నారని.. పవన్‌ను కలవనీయకుండా చేస్తున్నారని ఆరోపించారు బండ్ల. అయితే అవి తన కామెంట్స్ కావని బండ్ల తరువాత వివరణ ఇచ్చారు.
అయితే ఈ మధ్యే బండ్ల గణేష్ తన ఆఫీస్‌లో పవన్ ఫొటోను తీసేసి వేరే ఫొటో పెట్టారు. అలాగే ట్విట్టర్‌లోనూ ఒక పోస్ట్ పెట్టారు. నువ్వు ఎవరి కోసం పనిచేయకు. నీ కుటుంబ సభ్యులు, పిల్లలు, భార్య, తల్లిదండ్రులను చూసుకో. నీకు ఎవరూ సహాయం చేయరు. నీ జీవితం నీది.. అంటూ వైరాగ్యపు పోస్టు పెట్టారు. దీంతో పవన్‌కు, బండ్లకు మధ్య విభేదాలు ఉన్నట్లు స్పష్టమైంది. అయితే ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్, పవన్‌ల గురించి వస్తున్న వార్తల నేపథ్యంలో మరోమారు బండ్ల గణేష్ అంశం తెరపైకి వచ్చింది. పవన్ సినిమాలను త్రివిక్రమ్ కంట్రోల్ చేస్తున్నారని.. పవన్‌ను కలవాలంటే ముందుగా త్రివిక్రమ్‌ను కలవాలని కండిషన్ పెట్టారని.. ఈ క్రమంలోనే సినిమా కథ చెప్పాలన్నా.. ఇతర ఏ విషయమైనా ముందుగా త్రివిక్రమ్‌ను సంప్రదించాల్సి వస్తుందని.. ఆయన ఓకే చెబితేనే పవన్‌ను కలిసేందుకు అనుమతిస్తున్నారని.. వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.
ఈ క్రమంలోనే ఈ వార్తల నేపథ్యంలో బండ్ల గణేష్ అంశం తెరమీదకు వచ్చింది. పవన్‌కు, ఆయనకు మధ్య త్రివిక్రమ్ వచ్చి ఉంటారని.. పవన్‌ను కలవాలంటే త్రివిక్రమ్‌ను కలవాల్సి వస్తుందని.. ఇది నచ్చడం లేదని.. కనుకనే బండ్లకు, పవన్‌కు మధ్య గ్యాప్ పెరిగిందని.. కాబట్టే పవన్, బండ్ల విడిపోయారని అంటున్నారు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ వల్లే బండ్ల గణేష్ పవన్‌కు దూరమయ్యారని అంటున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా.. బయటకు చెప్పకపోయినా బండ్ల గణేష్, పవన్ మాత్రం దూరమైపోయారనే అంటున్నారు. ఇక దీనికి సరైన సమాధానాన్ని కాలమే చెప్పాల్సి ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…