The Warrior : రామ్ పోతినేని మొదటి సారిగా పోలీస్ పాత్రలో నటించిన మూవీ.. ది వారియర్.. ఈ మూవీ తాజాగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో రామ్ తమిళ తెరకు కూడా పరిచయం అయ్యారు. లింగు స్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రామ్ పక్కన కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. ఇందులో రామ్ పోలీస్ పాత్రలో అదరగొట్టాడు. అలాగే పాటలు కూడా బాగానే ఉన్నాయి. కానీ సినిమాకు ఆశించినంత స్థాయిలో స్పందన అయితే రావడం లేదు.
ఈ సినిమాకు గాను టిక్కెట్ల రేట్లు తగ్గకపోవడం, వర్షాలు దెబ్బ తీస్తుండడం వంటి కారణాల వల్ల థియేటర్లలో ప్రేక్షకులు కరువయ్యారు. ఇక సినిమాకు బిలో యావరేజ్, నెగెటివ్ టాక్ వస్తోంది. ఇవన్నీ సినిమా కలెక్షన్లను దెబ్బ తీస్తున్నాయి. ఈ క్రమంలోనే సినిమా డిజాస్టర్ అవుతుందేమోనని అంటున్నారు. అదే జరిగితే రామ్ ఖాతాలో ఇంకో ఫ్లాప్ పడినట్లేనని అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మూవీకి రూ.35 కోట్ల మేర థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరగ్గా.. అందులో 50 శాతం కూడా వస్తాయో.. రావో.. అని అంటున్నారు.
ది వారియర్ మూవీకి గాను మొదటి రోజు రూ.6 కోట్లు వచ్చాయి. అంటే 17 శాతం రికవరీ అయింది. ఇక రెండో రోజు నుంచి కలెక్షన్లలో దారుణమైన డ్రాప్ కనబడుతోంది. అంటే సినిమాకు 50 శాతం రికవరీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది. అదే జరిగితే ది వారియర్ మూవీ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అవుతుందని అంటున్నారు. అయితే వీకెండ్ రావడంతో కలెక్షన్లలో ఏమైనా మార్పు కనిపిస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా సోమవారం ముగిస్తేనే గానీ ది వారియర్ భవితవ్యం ఏంటి ? అనేది తెలియదు. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…