Thalalo Rendu Sudulu : పూర్వకాలం నుంచి మనం అనేక విశ్వాసాలను నమ్ముతూ వస్తున్నాం. పెద్దలు వాటిని మనకు చెబుతూ వస్తున్నారు. అయితే కొన్ని విశ్వాసాలు నిజం అవుతుంటాయి. అలాంటి వాటిలో ఒకటి.. తలలో రెండు సుడులు. ఈ విధంగా ఉన్నవారికి రెండు పెళ్లిళ్లు అవుతాయని.. ఇద్దరు భార్యలు ఉంటారని.. పట్టిందల్లా బంగారమే అవుతుందని.. చెబుతుంటారు. మరి దీనికి పండితులు ఏమని సమాధానం చెబుతున్నారు.. అంటే..
తలలో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు కావు. పెద్దలు ఆ విధంగా సామెత చెబుతూ ఉంటారు కానీ.. శాస్త్రాల ప్రకారం.. తలలో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయని.. ఎక్కడా చెప్పలేదు. అలా ఎక్కడైనా జరిగితే అది యాదృచ్ఛికమే. కానీ ఈ విషయం నిజం కాదు.
అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాత్రం తలలో రెండు సుడులు ఉండడం అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని అంటున్నారు. ఎందుకంటే ఈ విధంగా ఉన్నవారు సాధారణ వ్యక్తుల కన్నా భిన్నంగా ఆలోచిస్తారు. భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. అనేక విషయాలలో వారు ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటారు. అవి వారికి మేలు చేస్తాయి. అలాగే ఏ విషయంలో అయినా సరే దూరదృష్టి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ వ్యక్తులు అంత సులభంగా మోసపోరు. మోసగించే గుణం కూడా ఉండదు. కష్టపడి పైకి వస్తారు.
తలలో రెండు సుడులు ఉన్నవారు మిగిలిన వారి కన్నా భిన్నంగా ఆలోచిస్తారు. ఎల్లప్పుడూ సృజనాత్మకతను కోరుకుంటారు. చురుగ్గా ఉంటారు. వీరికి జీవితంపై ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. వీరు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు, ఏ రంగంలో అయినా రాణించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అంతేకానీ.. తలలో రెండు సుడులు ఉన్నంత మాత్రాన రెండు పెళ్లిళ్లు మాత్రం కావు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…