Telugu States : పూర్వకాలం నుంచి సమాజంలో స్త్రీల పట్ల వివక్ష నెలకొని ఉంది. వారికేమీ చేతకాదు, వారు కేవలం వంట ఇంటికే పరిమితం కావాలనే భావం అప్పటి నుంచి ఉంది. దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. స్త్రీలు పురుషుల కన్నా దీటుగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నప్పటికీ వారిపై వివక్ష మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఓ షాకింగ్ సర్వే బయటకు వచ్చింది. అందులో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) ప్రకారం మన దేశంలో చాలా రాష్ట్రాల్లో మహిళలు తమను తమ భర్తలు కొట్టినా ఫర్వాలేదని అనుకుంటున్నారు. 14 రాష్ట్రాల్లో 30 శాతం మంది మహిళలు ఇందుకు అనుకూలంగా ఉన్నారు. అంటే.. వీరందరూ తమను తమ భర్తలు కొట్టినా ఫర్వాలేదని భావిస్తున్నారన్నమాట.
అయితే ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో మరీ అధ్వాన్నంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 84 శాతం మంది మహిళలు తమను తమ భర్తలు కొట్టినా ఫర్వాలేదులే అన్న ధోరణిలో ఉన్నట్లు వెల్లడైంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల తరువాత స్థానంలో కర్ణాటక ఉంది. అక్కడ 77 శాతం మంది మహిళలు ఆ విధంగా ఫీలవుతున్నారట.
సాధారణంగా ఇంట్లో పిల్లలను నిర్లక్ష్యం చేయడం, భర్త తరఫు కుటుంబ సభ్యులను పట్టించుకోకపోవడం, అనుమానాస్పదంగా వ్యవహరించడం లేదా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, భర్త లేదా కుటుంబ సభ్యులతో తరచూ వాదించడం, శృంగారం చేసేందుకు విముఖతను చూపించడం, నమ్మకం లేకపోవడం, భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లడం, ఇంటిని పట్టించుకోకపోవడం, వంట చేయకపోవడం.. వంటి అంశాల్లో భర్తలు తమను కొట్టినా ఫర్వాలేదులే.. అని ఆ శాతం మంది మహిళలు అనుకుంటున్నారు. ఈ మేరకు సర్వేలో వెల్లడి కావడం షాక్‌ను కలిగిస్తోంది.
అయితే ఈ విధంగా మహిళల ధోరణి ఉందంటే గృహ హింస కూడా ఎక్కువగానే ఉన్నట్లు భావించాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. పూర్వ కాలం నుంచి స్త్రీల పట్ల ఉన్న ధోరణి ఇంకా అలాగే ఉందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని నిపుణులు అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…