దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో హాస్పిటళ్లలో సదుపాయాలకు తీవ్ర కొరత ఏర్పడింది. హాస్పిటళ్లు అన్నీ కోవిడ్ బాధితులతో నిండిపోతున్నాయి. బెడ్లు, ఆక్సిజన్, మందులు, వైద్య సిబ్బందికి తీవ్ర కొరత ఏర్పడింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సదుపాయాలకు కొరత ఏర్పడింది. అయితే మెరుగైన చికిత్స కోసం ఏపీ నుంచి కొందరు కోవిడ్ బాధితులను కుటుంబ సభ్యులు తెలంగాణకు తీసుకువస్తున్నారు. హైదరాబాద్ నగరానికి ఆంబులెన్స్‌లలో వస్తున్నారు. కానీ నగరంలోనూ సదుపాయాలకు కొరత ఏర్పడడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆంబులెన్స్‌లను రాష్ట్రంలోకి అనుమతించడం లేదు.
ఏపీ నుంచి ఆంబులెన్స్‌లలో వస్తున్న కోవిడ్ బాధితులను తెలంగాణ పోలీసులు తిప్పి పంపేస్తున్నారు. కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు ఏపీ నుంచి వచ్చిన ఆంబులెన్స్‌లను వెనక్కి పంపేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి వారు వెళ్తున్నారు. అయితే హైదరాబాద్‌లోనూ బెడ్లకు కొరత ఏర్పడిందని, సదుపాయాలు లేవని పోలీసులు చెబుతున్నారు.
కానీ తమకు బెడ్ దొరికే పరిస్థితి ఉందని, దయచేసి అనుమతించాలని కోవిడ్ బాధితుల తరఫు కుటుంబ సభ్యులు, బంధువులు వేడుకుంటున్నారు. అయినప్పటికీ పోలీసులు వారిని తెలంగాణలోకి అనుమతించడం లేదు. దీంతో చేసేది లేక వారు వెను దిరుగుతున్నారు. ఇక తెలంగాణలో వైద్య సిబ్బంది కొరత ఏర్పడడంతో సీఎం కేసీఆర్ 50వేల మంది ఎంబీబీఎస్ డాక్టర్లను కాంట్రాక్టు ప్రాతిపదికన 2-3 నెలల కోసం నియమించుకోవాలని హెల్త్ ఆఫీసర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే పరిస్థితి రోజు రోజుకీ మరింత దయనీయంగా మారుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…